Asianet News TeluguAsianet News Telugu

Krishna Mukunda Murari: భవానిని నందిని గురించి నిలదీసిన ముకుంద.. ఇంట్లోంచి వెళ్ళిపోనున్న కృష్ణ!

Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా మంచి రేటింగ్ తో ముందుకి దూసుకుపోతుంది. మరో స్త్రీ తో పెళ్లి అయిన ప్రేమికుడిని తనవైపు తిప్పుకోటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Bhavani tells Mukunda about Sidhu and Nandu's childhood in todays Krishna Mukunda Murari serial gnr
Author
First Published Mar 20, 2023, 2:38 PM IST

ఎపిసోడ్ ప్రారంభంలో నాకు రెండు రోజులు టైం కావాలి అంటుంది కృష్ణ. అప్పుడైనా జరిగేది ఇదే అంటుంది భవాని. తను టైం అడుగుతుంది కదా ఇద్దాం పెద్దమ్మ. అనవసరంగా ముందే నిందలు వేయటం ఎందుకు,నిజం నిరూపిస్తానంటుంది కదా అంటూ భార్యని వెనకేసుకొస్తాడు మురారి. మరోవైపు గదిలో మంచికి పోతే చెడు ఎదురయింది.

అలా అని పట్టించుకోకుండా వదిలేద్దాము అంటే నందిని నా మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంది అని తండ్రికి చెప్పుకుంటుంది  కృష్ణ. అంతలోనే మురారి వచ్చి జరిగిందానికి బాధపడకు అంటాడు నేను బాధపడేది నాకోసం కాదు నందినికి అలాగా జరిగినందుకు బాధపడుతున్నాను. అయినా నేను ఇక్కడికి వచ్చిన దగ్గరనుంచి నందిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అందరూ చూశారు.

అయినా నా మీద నిందలు వేస్తున్నారు మరోవైపు గౌతమ్ సర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ బాధపడుతుంది కృష్ణ. నిందలే పని నువ్వే అంటున్నావు కదా బాధపడటం ఎందుకు అంటాడు మురారి. నాకు మీరు ఎంతో మంచి చేశారు అలాంటిది మీకు చెడ్డ పేరు తీసుకువస్తే అది పాపం అంటుంది కృష్ణ. నేను మా సీనియర్ ని నమ్మాను ఇలా చేస్తారని అనుకోలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అంటుంది కృష్ణ.

ఆ టాబ్లెట్లు ఇచ్చింది గౌతమ్ సరా అని అడుగుతాడు మురారి. తన పేరు చెప్పొద్దని చెప్పిన విషయం గుర్తొచ్చి ఆయన చెప్తే వేరే సీనియర్ డాక్టర్ ఇచ్చారు అని మాట మారుస్తుంది కృష్ణ అలాంటప్పుడు గౌతమ్ సార్ తప్పేముంది అంటాడు మురారి. ఎలా చెప్పుకునేది టాబ్లెట్లు ఇచ్చి చెప్పొద్దు అని గౌతమ్ సార్ చెప్పారు. ఆయన మాట నమ్మినందుకు చిక్కుల్లో పడ్డాను ఒక్కసారి టచ్ లోకి వస్తే బాగుండు అనుకుంటుంది కృష్ణ.

మరోవైపు నందినికి హాస్పిటల్లో చూసిన గౌతమ్ మొహం గుర్తొచ్చి సిద్దు, సిద్దు అని పిలుస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన ముకుంద ఏంటి కలర్ ఇస్తున్నావు అని అడుగుతుంది. సిద్దు ఏడి అని అడుగుతుంది నందు సిద్దు ఎవరు అని అడుగుతుంది ముకుందా సిద్దు అని పంపించేసారా అంటుంది నందు. ముకుంద జ్యూస్ తాగమని ఎంత అడిగినా తాగదు దాంతో ఆమె వెనక్కి వెళ్ళిపోతుంది.

ఆమెకి భవాని ఎదురుపడి తను జ్యూస్ తాగలేదు కదా, అనుకున్నాను అది ఆ తింగరి పిల్ల మాట తప్పితే ఎవరి మాట వినటం లేదు అంటుంది. ఇప్పుడు కృష్ణ పేరు కాకుండా ఇంకో కొత్త పేరు కలవరిస్తుంది, పని పిలుస్తుంది అంటుంది ముకుంద. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భవాని. అతను ఎవరో మీకు తెలుసా అంటుంది ముకుంద. తెలుసు నందిని పూర్తిగా గతం మర్చిపోయి పసితనంలోకి  వెళ్ళిపోయింది అందుకే ఆ పిల్ల చేష్టలు.

సిద్దు అనేవాడు ఈ వీధిలోనే ఉండేవాడు ఇద్దరు సాయంత్రం ఆడుకునేవారు. తర్వాత సిద్దు వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి నార్త్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడే గుర్తొచ్చి ఉంటాడు అంటూ అబద్ధం చెప్తుంది భవాని. సరే అత్తయ్య మీరు తాగిస్తే అయినా తాగుతుందేమో అంటూ భవానీకి గ్లాస్ ఇచ్చి వెళ్ళిపోతుంది ముకుంద. మరోవైపు తోటి కోడలు మాటలు తలుచుకొని కంగారుపడుతుంది రేవతి.

అంతలోనే గదిలోకి వచ్చిన ఈశ్వర్ నిన్న కాక మొన్న ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా అన్నిటికీ అడ్డుపడి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అంటూ చిరాకు పడతాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటుంది రేవతి. ఎవరి గురించో నీకు తెలియదా అంటాడు ఈశ్వర్. మన కోడలు కూతురు గురించి శ్రద్ధ తీసుకుంటే మీ అందరికీ ఎందుకు అంత కోపాలు వస్తున్నాయో నాకు తెలియటం లేదు అంటుంది రేవతి.

ఏంటి కోడల్ని సపోర్ట్ చేస్తున్నావా మాట్లాడు ఇప్పటివరకు లేదు కానీ ఎప్పటినుంచి ఉంటుంది రేవతి. అవసరమైతే కోడలు కోసం మీతోనైనా పోరాడుతాను అంటుంది రేవతి. నీకేమైనా పిచ్చి పట్టిందా అయినా మనకి తెలియని కోడలికి మాత్రమే తెలిసింది ఏంటో అంటాడు ఈశ్వర్. వైద్యం అంటుంది రేవతి. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా అయినా రెండు రోజుల్లో ఏదో నిరూపిస్తానంది కదా నీ కోడలు అంటాడు ఈశ్వర్.

నాకు ఆ నమ్మకం ఉంది తను నిజం నిరూపిస్తే ముకుందని బయటికి పంపించేద్దామా అంటుంది రేవతి. మధ్యలో ముకుందని ఎందుకు లాగుతున్నావు అంటాడు ఈశ్వర్. మరి ముకుంద ఎందుకు కలగజేసుకుంటుంది రేవతి. కృష్ణ ముందు ముందు ఇలాగే ప్రవర్తిస్తే ఇంట్లోంచి బయటికి పంపించేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకో అంటూ కోపంగా బయటికి వెళ్లిపోతాడు ఈశ్వర్.

మరోవైపు మంచి నిద్రలో ఉన్న మురారి కి ఏడుస్తున్న శబ్దం వినబడి లెగుస్తాడు. ఏడుస్తున్న కృష్ణని చూసి ఏమైంది అని అడుగుతాడు. మంచి గుణపాఠం అయింది, ఎవర్ని నమ్మకూడదని అర్థమైంది. నమ్మితే అంత మోసం చేశారు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు మురారి. నా బ్రతుకు నవ్వులాట అయిపోయింది అంటుంది కృష్ణ. అర్ధరాత్రి మాకు ఈ బొమ్మలాట ఏంటి అంటాడు మురారి.

నేను గౌతమ్ సార్ ని ఎంతో నమ్మాను ఎన్నో అసలు పెంచుకున్నాను నా ఆశలన్నీ అడియాసలు  అయిపోయాయి. నా ఫోన్ కూడా ఎత్తటం లేదు అంటుంది కృష్ణ. కృష్ణ గౌతమ్ మీద అసలు పెంచుకోవడం ఏంటి, అయినా నాతో ఇంత ధైర్యంగా చెప్తుంది ఏంటి వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనుకుంటాడు మురారి. మరోవైపు అందరూ చూస్తుండగా నన్ను నీతో మాట్లాడితే గొడవ చేస్తారు అనుకుంటూ ఎవరు లేవకముందే నందిని గదికి వెళ్తుంది.

పడుకుని ఉన్న నందిని చూస్తూ ఇంత మంచి అమ్మాయిని పిచ్చిదాన్ని చేయాలని ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు ముందు నేను నిర్దోషిని నిరూపించుకోవాలి తర్వాత నందిని సంగతి ఏసీబీ సరికి అప్పచెప్పి నేను వెళ్ళిపోవాలి అనుకుంటుంది కృష్ణ. అంతలోనే నందిని లేచి నన్ను చూడడానికి వచ్చావా అంటుంది నందిని. హాస్పిటల్ కి వెళ్తున్నాను నిన్ను చూడడానికి వచ్చాను సరే వెళ్తాను అంటుంది కృష్ణ.

వచ్చేటప్పుడు బండిమీద వస్తావా బండిమీద సిద్దు కూడా వస్తాడు మేమిద్దరం ఎక్కడికో వెళ్తాము నాకు తను ఏదో కొనిస్తాడు అని చెప్తూ  బాబాయ్ వచ్చాడు  బాబాయ్ కి వచ్చాడు అంటూ భయపడిపోతుంది నందిని. బాబాయ్ వాళ్ళు రాలేదు అంటుంది కృష్ణ ఇప్పుడు కాదు అప్పుడు వచ్చారు అయినా నేను కూడా నీతో వచ్చేస్తాను నాకు సిద్దు కావాలి అంటుంది నందిని.

సిద్దు అక్కడ ఎందుకు ఉంటాడు అయినా నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తే బాబాయ్ వాళ్ళు మందలిస్తారు అంటుంది కృష్ణ. అవును నిజంగానే తిడతారు అయితే నువ్వు వచ్చేటప్పుడు సిద్దు ని తీసుకురా అని కృష్ణకి చెప్తుంది నందిని. నువ్వు పడుకో నేను వెళ్లి తీసుకు వస్తాను అనటంతో నందిని పడుకుంటుంది. నీకోసమే వెళ్తున్నాను అనుకుంటూ ఆమె రూమ్ నుంచి బయటకు వస్తుంది  కృష్ణ.

ఆమెకి రేవతి ఎదురుపడి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. నా అదృష్టాన్ని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. నా మీద ఉన్న అపనిందని చెరుపుకోవడానికి వెళ్తున్నాను అంటుంది. అపనిందలు  చెరిగిపోవడానికే వస్తాయి కానీ నువ్వు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటుంది రేవతి. నేను మా సీనియర్ని నీలదీయడానికి వెళుతున్నాను అత్తయ్య అంటుంది కృష్ణ. నీకు కష్టం వస్తే చెప్పుకోవడానికి అమ్మ లేదు.

అందుకని నన్నే అమ్మని అనుకో, స్నేహితురాలిని అనుకో, అత్తని అనుకో, ఆరుస్తాను తీరుస్తాను తర్వాత విషయం  కానీ నువ్వు ఒంటరివి కాదు అనే విషయం నీకు తెలుస్తుంది అదే చాలు అంటుంది రేవతి. ఆమె ఎఫెక్షన్ కి కరిగిపోతుంది కృష్ణ. టిఫిన్ చేయకుండా వెళ్లొద్దు అంటూ కోడల్ని కూర్చోబెట్టి టిఫిన్ తినిపిస్తుంది రేవతి. అందరూ నిన్ను నమ్ముతారు, అందరూ నిన్ను అర్థం చేసుకునే రోజు దగ్గరకు వస్తుంది అంటూ ధైర్యం చెబుతుంది.

అంతలో కృష్ణ పలమారటంతో మంచినీళ్లు తాగిస్తుంది రేవతి. ఆమె అభిమానానికి కన్నీరు పెట్టుకుంటుంది కృష్ణ. తరువాయి భాగంలో హాల్లో అందరూ ఉండగా ఏమైంది ఉంటున్నావా వెళ్తున్నావా అని అడుగుతుంది ముకుంద. ఇప్పటికీ నేను నందిని విషయంలో తప్పు చేయలేదని అనుకుంటున్నాను కానీ దురదృష్టం కొద్దీ రుజువులు సంపాదించలేకపోయాను అంటుంది కృష్ణ.

అందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవటమే పరిష్కారమా, పెద్దత్తయ్యని క్షమాపణ అడుగు అంటుంది రేవతి. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే క్షమాపణ అడుగుతారు. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే క్షమాపణ చెబుతారు, చెయ్యని తప్పుని ఎప్పటికీ ఒప్పుకోలేను కచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటుంది కృష్ణ.

Follow Us:
Download App:
  • android
  • ios