Krishna Mukundha Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. తనని ప్రేమించిన వాడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక స్త్రీ పడే తపన ఈ కథ. ఇక ఈరోజు ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

ఎపిసోడ్ ప్రారంభంలో కృష్ణ కోసం తెచ్చిన చీరని వెతుకుతుంటాడు మురారి. ఆ చీరని కట్టుకొని వస్తుంది ముకుంద. షాక్ అవుతాడు మురారి. నీకు చీరల సెలక్షన్ బాగా తెలుసు, నాకు ఏ కలర్స్ బాగా నొప్పుతాయో నీకు ఇంత బాగా తెలుసు అని అనుకోలేదు అంటుంది ముకుంద. ఈరోజు నా బర్త్ డే కాదు నీ బర్త్ డే కాదు మరేంటి స్పెషల్, నాకోసం చీర తేవాలని నీకు ఎందుకు అనిపించింది అంటుంది ముకుంద.

ఇందాక నువ్వు నాకోసం ఎంత కంగారు పడ్డావో, నాకోసం నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నీ కళ్ళలో కనిపించింది అంటుంది ముకుంద. నాకు కావలసింది ఈ ప్రేమే నువ్వు కాటన్ చీర తెచ్చినా కూడా ఇష్టంగా కట్టుకుంటాను మీ నుంచి నేను ఇదే కోరుకున్నాను అంటుంది ముకుంద. అంతలో భవాని పిలవడంతో కిందకి వెళ్తాడు మురారి. కృష్ణ నీకేం అవుతుంది అని అడుగుతుంది. ఏమైంది పెద్దమ్మ ఎందుకు అలా అడుగుతున్నావు అంటే అడిగిన దానికి సమాధానం చెప్పు అంటుంది భవాని.

నా భార్య అంటాడు మురారి. నీ భార్య ఈ టైం వరకు ఇంటికి రాలేదు, ఇంతకుముందు కూడా ఆలస్యంగానే వచ్చింది నువ్వేమీ పట్టించుకోవా అంటూ నిలదీస్తుంది. ఎవరికీ క్రమశిక్షణ లేదా క్రమశిక్షణ లేని వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని తెలియదా అంటుంది భవాని. తెలుసు అంటాడు మురారి. తనకి ఎన్నిసార్లు చెప్పాలి తను ఏమైనా చిన్నపిల్లా, హౌస్ సర్జన్ చేస్తుంది అంటుంది భవాని. ఇకనుంచి త్వరగా పంపించమని పరిమళతో చెప్తాను అంటాడు మురారి.

ఏం త్వరగా రమ్మని నీ భార్యకి చెప్పలేవా అంటుంది భవాని. నేనే తనని పికప్ చేసుకుందాము అంటే ముకుంద నన్ను డ్రైవర్ అందంట అందుకే తను ఒక్కతే వెళ్తుంది, వస్తుంది అంటాడు మురారి. నాకు ఆ కారణాలు ఏమీ చెప్పకు ఇతనికి ఇబ్బంది అయితే వేరే ఏర్పాట్లు చేయు అంతేకానీ ఇంటికి ఆలస్యంగా రావడానికి వీల్లేదు. అన్ని రోజులూ మనవి కాదు అంటుంది భవాని. సారీ పెద్దమ్మ అంటాడు మురారి.

నువ్వెందుకు సారీ చెప్పడం మా మధ్యలో నువ్వు నలిగిపోతున్నావు నేను నీ భార్యతోనే తేల్చుకుంటాను అంటుంది భవాని. నీ వరకు ఎందుకక్కా నేను మందలిస్తాను అంటుంది రేవతి. కోడలని వెనకేసుకొస్తున్నావా క్రమశిక్షణ విషయంలో ఎవరైనా ఒకటే అంటాడు ఈశ్వర్. అంతలోనే గౌతమ్ బైక్ మీద వస్తుంది కృష్ణ. గౌతమ్ నందిని కనిపిస్తుందేమో అని వెతుకుతాడు.

నందిని కూడా పైనుంచి గౌతమ్ ని చూస్తుంది కానీ గుర్తుపట్టదు. థాంక్స్ చెప్పి బాయ్ చెప్తుంది కృష్ణ. అయినా వెళ్ళకపోవటంతో వెళ్ళండి సార్ అని చెప్తుంది కృష్ణ. చేసేదిలేక వెళ్ళిపోతాడు గౌతమ్. అతను ఎవరు అతను బండి మీద ఎందుకు వచ్చావు అని అడుగుతుంది భవాని. లేట్ అయిపోయింది అందుకే అతని బండిమీద వచ్చాను అంటుంది కృష్ణ. క్యాబ్లో ఎందుకు రాలేదు అని భవాని అడిగితే ట్రై చేయలేదు.

ఈలోపే సార్ లిఫ్ట్ ఇస్తానన్నారు అంటుంది కృష్ణ. నీకు ఎంత ధైర్యం ఏసీపీ భార్యవి,ఈ రాత్రిపూట పరాయి మగవాడి బండిమీద వస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటుంది భవాని. మీరు ఏమీ అనుకోరు అనుకున్నాను అంటుంది కృష్ణ. ఎందుకు అనుకోరు ఈ ఇంటి ఆడవాళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటి హద్దు మీరు కూడదు అయినా ఇంత ఆలస్యమైంది ఎందుకు అంటుంది భవాని.

హాస్పటల్లో టైం నా చేతిలో ఉండదు ఉంటుంది కృష్ణ. అదంతా నాకు తెలియదు టైం కి నువ్వు ఇంట్లో ఉండాలి అంటుంది భవాని. మాకు చెప్పిన పని పూర్తి చేస్తేనే కానీ రావటానికి వీలుపడదు అంటుంది కృష్ణ. మాటకు మాట సమాధానం చెప్తున్నావా అని భవాని అంటే మౌనంగా ఉంటే నిర్లక్ష్యం చేస్తున్నానంటారేమో అని అంటుంది కృష్ణ. నా భర్తని పిక్ చేసుకోమందాం అంటే నీ డ్రైవరా అని అడిగింది నాతోటి కోడలు.

హాస్పిటల్ ఊరికి చివరన ఉంటుంది. చుట్టుపక్కల కూడా ఎవరు ఉండరు కానీ ఏసీపీ సర్ ఇచ్చిన ధైర్యంతోనే వెళ్లి వస్తున్నాను అంటుంది కృష్ణ. పరాయి మగవాడి బండిమీద రావటం తప్పే ఇంకెప్పుడూ అలా రాను అంటుంది కృష్ణ. అలాంటప్పుడు వెళ్లడం మానేయ్ అంటుంది ముకుంద. ముందు నా విషయంలో తలదూర్చటం నువ్వు మానేయ్ అంటుంది కృష్ణ.

తోటి కోడళ్ళు అక్క చెల్లెళ్ళు లాగా కలిసి ఉండాలి అంటూ కసురుకుంటుంది భవాని. ఈ ముక్క ముకుంద కి కూడా చెప్పండి అంటుంది కృష్ణ. నువ్వు ఇంటికి ఆలస్యంగా రావడం ఒక తప్పు, పరాయి మగ వాడి బండి మీద రావటం ఇంకో తప్పు అంటూ ఈ పూటకి తనకి భోజనం పెట్టొద్దు అంటూ రేవతికి చెప్తుంది భవాని. అది కాదు అక్క అంటూ రేవతి ఏదో చెప్పబోతే వినిపించుకోదు భవాని.

మరోవైపు గదిలోకి వచ్చిన భార్య మీద చిరాకు పడతాడు మురారి. మీకు ఏమైంది అంటుంది కృష్ణ. నీకేమైందని నేను అడిగానా అంటాడు మురారి. నాకేమైంది బానే ఉన్నాను కదా అని కృష్ణ అంటే బానే ఉంటావు సంతోషంగా ఉంటావు మురారి నా బ్రతుకు అదే తక్కువైంది అయినా ఇప్పుడు కారణం లేకుండా ఎందుకు చిరాకు పడుతున్నారు అంటుంది కృష్ణ. త్వరగా వస్తానని చెప్పావు, తెర చూస్తే రాత్రి అయ్యాక వచ్చావు.

 అది కూడా మీ గౌతమ్ సర్ బండి మీద మళ్ళీ ఏమైంది అని అడుగుతున్నావు అంటాడు మురారి. నేనేమైనా ముకుంద లాగా ఖాళీగా ఉన్నాను అంటుంది కృష్ణ. మధ్యలో తను ఏం చేసింది అంటాడు మురారి. పనిచేసే అలిసిపోయి వస్తే ఇంత పెద్ద పంచాయతీ ఇది పెట్టారు నేను బయట టైం పాస్ చేసి రావట్లేదని వాళ్లకి తెలియదా అంటుంది కృష్ణ. పికప్ చేసుకోమంటే నేను చేసుకుంటాను కదా.

 ఎందుకు వేరే వాళ్ళ బండి మీద రావడం అంటాడు మురారి. అలా రావడం నాకు మాత్రం సరదానా, బాగా లేట్ అయింది అన్న కంగారులో ఇంటికి వచ్చేస్తే చాలు అనుకొని వచ్చేసాను అంటుంది కృష్ణ. చాలా ఎర్లీగా రాత్రి తొమ్మిది కల్లా వచ్చేసావు అని వెటకారంగా అంటాడు మురారి. ఇప్పుడు ఏమంటారు అంటుంది కృష్ణ. ఇలాగే దూరమైపోతుండు ఏం జరిగినా నేను చూస్తూ ఉంటాను అంటాడు మురారి.

నేను దగ్గర ఏదీ లేదు దూరమయ్యేది లేదు ఇంకొక 11 నెలలు గడిస్తే వెళ్ళిపోయి నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంటుంది కృష్ణ. మీ వాళ్ళలాగే మీరు కూడా మాట్లాడుతారని నేను అసలు ఊహించలేదు మంచి లెసన్ చెప్పారు అంటుంది కృష్ణ. నువ్వు నాకు చెప్పావు అంటాడు మురారి. అయితే బాగా నేర్చుకుని ఎగ్జామ్ లో రాయండి అంటూ వెళ్ళిపోబోతుంది కృష్ణ.

నాకు ఏమీ పని లేదు అనుకున్నారా నీతో గొడవ పెట్టుకోవడానికి అంటాడు మురారి. కిందన పెద్ద అత్తయ్య తిట్టారు పైన మీరు తిడుతున్నారు అసలు ఎందుకు తిడుతున్నారు నాకు క్లారిటీ లేదు. పైగా అన్నం కూడా బెటర్ అంట ఇది ఒక పనిష్మెంట్ మళ్లీ అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. కిందికి వచ్చి భోజనం వడ్డించుకుంటుంది కృష్ణ.

 పెద్ద అత్తయ్య ఏం చెప్పారు నువ్వేం చేస్తున్నావు, నీకు భోజనం పెట్టొద్దని కదా చెప్పారు అంటుంది ముకుంద. పెట్టుకోవద్దు అని నాకు చెప్పలేదు కదా అంటుంది కృష్ణ. నువ్వు తినకుండా ఉండడమే నీకు పనిష్మెంట్ అంటుంది ముకుంద నువ్వు కాపలాగా ఉన్నావా అంటుంది కృష్ణ. అవును పెద్ద అత్తయ్య ఏది చెప్తే అది జరిగేలా చూడటమే నా పని అంటుంది ముకుంద. ఇదే పెద్ద అత్తయ్య ఒకసారి కుక్క గాడిద కథ చెప్పారు.

 కుక్క చేయవలసిన పని కుక్క గాడిద చేయవలసిన పని గాడిద చేయాలి అని కథలో నీతి అంటుంది కృష్ణ. ఇప్పుడు ఈ కథ నాకెందుకు చెప్తున్నావ్ అంటే ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి అంటుంది కృష్ణ. నేను భోజనం గురించి మాట్లాడితే నువ్వు అడ్డమైన కథలు చెప్తున్నావేంటి అంటుంది ముకుంద. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తే బాగుంటుంది అయినా ఈ భోజనం నాకు కాదు నందిని కి.

 నేను పెద్దతయ్య మాట అతిక్రమించెను ఈ ఇంటి పెద్ద కోడలు అయినా నీ మాట కూడా అధిక్రమించను అంటుంది కృష్ణ. కావాలంటే నువ్వు వచ్చి కాపలా కూర్చో భోజనం ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతుంది కృష్ణ. వెళ్ళిపోయే దానితో తగాదా ఎందుకులే అనుకుంటుంది ముకుంద. తరువాయి భాగంలో బండిమీద వెళ్తున్న కృష్ణ నేను రేపో మాపో వెళ్లిపోతాను కదా అప్పుడు ఐస్క్రీం తిన్న ప్రతిసారి నేనే గుర్తు రావాలి అంటూ మురారి కి చెప్తుంది. ఇంటికి వాళ్ళిద్దరూ బండి మీద రావడం చూస్తుంది ముకుంద.