బాలీవుడ్ ని డ్రగ్స్ కేసు షేక్ చేస్తుండగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. నిన్న ప్రముఖ లేడీ కమెడియన్, టీవీ హోస్ట్ భారతీ సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు 85 గ్రామ్స్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భారతి మరియు ఆమె హస్బెండ్ హార్స్  లింబాచియా డ్రగ్స్ సేవించే అలవాటు ఉందని అంగీకరించినట్లు సమాచారం. 

శనివారం భారతి సింగ్ ని అరెస్ట్ చేసిన అధికారులు నేడు ఉదయం ఆమె భర్త హార్ష్ లింబాచియాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ కాబడిన కొందరు డ్రగ్ పెడ్లర్స్ సమాచారంతో వీరిద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. హార్ష్ లింబాచియా నివాసం, మరియు కార్యాలయాలలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

డ్రగ్స్ కేసు బాలీవుడ్ లో దుమారం రేపగా, రియా చక్రవర్తి మరియు ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిలను అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసు కొంచెం సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో భారతి సింగ్ దంపతుల అరెస్ట్ మరో సంచలనానికి తెరలేపింది. టీవీ హోస్ట్ గా భారతి సింగ్ దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నారు. కపిల్ శర్మ షోలో కూడా భారతీ సింగ్ చేస్తున్నారు.