భానుప్రియకు తీరని దుఃఖం, భర్త హఠాన్మరణం

భానుప్రియకు తీరని దుఃఖం, భర్త హఠాన్మరణం

నిన్నటి తరం అందాల నటిగా పేరు తెచ్చుకున్న భానుప్రియ జీవితంలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆమె మాజీ భర్త ఆదర్శ కౌశల్ గుండెపోటు కారణంగా మృతిచెందారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో సింగిల్ గానే ఉంటున్నారు. ఈ షాకింగ్ న్యూస్ తెలిసిన వెంటనే ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న భానుప్రియ అమెరికాకు బయలుదేరి వెళ్లింది. భానుప్రియ 1998లో అమెరికాలో నివాసం ఉంటున్న ఆదర్శ్ కౌశల్ ను వివాహం చేసుకుంది. ఆ తరవాత కొన్నాళ్లపాటు వారి మ్యారీడ్ లైప్ సజావుగానే సాగింది. వాళ్లిద్దరికీ అభినయ అనే కుమార్తె కూడా ఉంది.  పెళ్లి తరవాత భానుప్రియ అమెరికాలో ఉండిపోయింది. అనుకోని కారణాలతో ఈ జంట 2005లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక భానుప్రియ తిరిగి కుమార్తెతో చెన్నై తిరిగొచ్చేసింది. అప్పటి నుంచే అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఉంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ ఒక్కడే అమెరికాలో ఉండిపోయారు. 
 

భానుప్రియ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుండటం.. టాలీవుడ్ కు దూరంగా చెన్నైలో ఉండిపోవడంతో ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలేవీ ఇక్కడ మీడియాకు... సినిమా జనాలకు పెద్దగా తెలియలేదు. అందుకే ఇప్పుడు ఆమె జీవితంలో జరిగిన ఈ విషాద ఘటన ఇంకా చాలామంది దృష్టికి రాలేదని తెలుస్తోంది.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos