Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండకు ఉంగరం తొడిగి ప్రపోజ్ చేసిన బెంగళూరు అమ్మాయి, రౌడీ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా

తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని ప్రస్తుతం ఆ క్రేజ్ దేశమంతా పాకింది. విజయ్ కోసం పడి చచ్చిపోతున్నారు ఫ్యాన్స్.. ఇక లేడీ ఫాలోయింట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.  రీసెంట్ గా ఓ బెంగళూరు అమ్మాయి అయితే ఏకంగా రింగు తొడిగి ప్రపోజ్ చేసింది కూడా. 
 

Bengaluru Girl proposes to Vijay Devarakonda
Author
Hyderabad, First Published Aug 23, 2022, 9:42 AM IST

తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని ప్రస్తుతం ఆ క్రేజ్ దేశమంతా పాకింది. విజయ్ కోసం పడి చచ్చిపోతున్నారు ఫ్యాన్స్.. ఇక లేడీ ఫాలోయింట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.  రీసెంట్ గా ఓ బెంగళూరు అమ్మాయి అయితే ఏకంగా రింగు తొడిగి ప్రపోజ్ చేసింది కూడా. 

యంగ్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ దేశ వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఆయన  అమ్మాయిల కలల రాకుమారుడు ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. విజయ్ మీద ఎంత క్రష్ అంటే.. కొంత మంది అమ్మాయిలు విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే.. చంపేస్తామంటూ బెదిరించారు కూడా. అంతలా ఆయన మీద ప్రేమ పెంచుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఓ అమ్మాయికి విజయ్ దేవరకొండకు ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. 

విజయ్ కొత్త చిత్రం లైగర్ ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లగా,.. అక్కడ ఎవరూ ఊహించని, అనుకోసి సంఘటన చోటు చేసుకుంది. తేజు అనే అమ్మాయి విజయ్ దేవరకోండను చూసి పులకించిపోయింది. తను ప్రాణంగా ప్రేమించి హీరోను  ఎదురుగా చూసి.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. అంతేకాదు, దిష్టి తగలకుండా అప్పటికప్పుడు ఓ ఉంగరం తొడిగి తన ప్రేమను వెల్లడించింది. ఆమె ప్రపోజ్ చేసిన తీరు పట్ల విజయ్ కూడా మెస్మరైజ్ అయ్యాడు.  సహృదయంతో స్పందించాడు. ఆమెను దగ్గరికి తీసుకుని  హగ్ చేసుకున్నాడు. అప్పటికే ఆశ్చర్యం తట్టుకోలేక ఏడుస్తున్న ఆ అమ్మాయిని ఓదార్చాడు. 

 

 

 

అంతేకాదు, లైగర్ ప్రమోషన్లు పూర్తయ్యేదాకా ఆమె తన వేలికి తొడిగిన రింగ్ ను తీయనని మాటిచ్చాడు విజయ్ దేవరకొండ. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక లైగర్ మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమా  ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైయినర్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించారు. ఇందులో హాలీవుడ్ బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కీలకపాత్ర పోషించారు.  విజయ్ దేవరకొండ  తల్లి పాత్రలో  ఓ పవర్ ఫుల్ రోల్ లో  రమ్యకృష్ణ కనిపించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios