Asianet News TeluguAsianet News Telugu

నంది అవార్డులు కావవి సైకిల్ అవార్డులు -బండ్ల గణేష్

  • ఏపీ సర్కారు నంది అవార్డుల జాబితాపై బండ్ల గణేష్ ఫైర్
  • అవార్డులు రాజకీయాలకు లోబడి ఇస్తున్నారంటూ గణేష్ ఘాటు వ్యాఖ్యలు
  • అసలు అవార్డులు రద్దు చేస్తే బెటర్ అంటున్న సి,,కళ్యాణ్
bandla ganesh fire on nandi awards committee

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డుల పై ఇప్పటికే సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున రచ్చ మొదలైంది. ఈ అవార్డ్స్ ఎంపిక పారదర్శకంగా లేదని, చంద్రబాబు సన్నిహితులకి, బాలయ్యకి క్లోజ్ గా వుండేవాళ్లకే ఈ అవార్డులు ఇచ్చేసారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఈ అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ బండ్ల గణేష్ నుంచి కూడా అవార్డుల ఎంపికపై షాకింగ్ కమెంట్లు వినపడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్ లిస్ట్ పారదర్శకంగా లేదంటూ... నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

 

ముఖ్యంగా ప్రతి తెలుగు ప్రేక్షకుడు మెగా హీరోలకు అన్యాయం జరిగిందని మాట్లాడుకుంటున్నారు. కాలాన్ని బట్టి అవార్డులు ఇస్తున్నారు, ప్రస్థుతం నడుస్తున్నది టీడీపీ కాలం అంటూ ఎద్దేవా చేశారు. అసలు ఎమ్మెల్యేగా, జ్యూరీ సభ్యుడిగా వుండి ఉత్తమ నటుడి అవార్డు తీసుకుంటారా, మన చేతిలో వుంది కదాని కాకుంటే మరేంటని ప్రశ్నించారు.

 

జ్యూరీ కేవలం తెరముందు మాత్రమేనని. తెరవెనుక అంతా రాజకీయంగా మనవాళ్లయితేనే అవార్డలు కేటాయించారని అన్నారు. చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు కంటితుడుపు చర్య అన్నారాయన. మెగా హీరో రామ్ చరణ్ నటించిన మగధీర సమయంలోనూ ఇలానే చేశారని గణేష్ ఆరోపించారు. కమిటీ ఏదైనా మెగా ఫ్యామిలీని నిర్లక్ష్యం చేస్తున్నారని గణేష్ ఆరోపించారు.

 

2016 అవార్డుల కమిటీలో అరవింద్ గారు కూడా  వున్నారు. కానీ ఆయన మెగా హీరోలకు అవార్డులు ఇవ్వాలని అఢగలేదని అన్నారు. తను టీడీపీ వ్యతిరేకిని కాదంటూనే.. ఏ పార్టీతో సంబంధం లేదంటూనే.. నాకు అన్యాయం అనిపిస్తే ప్రశ్నిస్తానంటూ ప్రభుత్వ వ్యవహారశైలిని ఎండగట్టారు.

అవార్డులు తీసేస్తే బెటర్-సి.కళ్యాణ్ 

కాగా గణేష్ వ్యాఖ్యలను సి.కళ్యాణ్ తప్పుపట్టారు. అవార్డుకి ఎంపిక కమిటీ ద్వారా జరుగుతుంది, వాళ్ల నిర్ణయాన్ని అంతా ఆమోదించాలి. ఇలా రోడ్ల మీద పడి చర్చించుకుంటే అవార్డులు రద్దు చేయటం మేలన్నారు సి.కళ్యాణ్.

Follow Us:
Download App:
  • android
  • ios