జైలు శిక్ష పై బండ్ల గణేశ్ ఏమంటున్నాడో చూడండి...

bandla ganesh clarification on jail term in temper case
Highlights

రచయిత వంశీ పై నా న్యాయ పోరాటం సాగిస్తానంటున్న బండ్ల గణేశ్

2015 టెంపర్ చిత్రం వివాదం  ఇది

కోటి నాలుగు లక్షల రూపాయలకు టెంపర్ కథా హక్కులను రచయిత వంశీ నుండి కొనడం జరిగింది.సినిమా సూపర్ హిట్ అయిన తరువాత హిందీ రీమేక్ హక్కులను దర్శక నిర్మాత అయిన రోహిత్ సెట్టి కి సంయుక్తంగా విక్రయించము,కానీ నాకు తెలియకుండా టెంపర్ కథను ఇంగ్లీష్ నవల హక్కుల వారికి  రచయిత వంశీ అమ్మాడు. దీనివలన నేను తీవ్ర మనస్తాపానికి లోనై ఇ విషయాన్ని సినీ ఛాంబర్ దృష్టి కి తీసుకు వచ్చాను.అదే సమయం లో టెంపర్ చిత్ర కథ కి ఇచ్చిన బ్యాలన్స్ డబ్బుల చెక్ ను నిలిపివేశాను.ఈవివాదం ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్నప్పటికీ వంశీ చెక్ ను పట్టుకొని కోర్టు కి వెళ్ళాడు. నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు వారు తుది తీర్పు ను ఇవ్వటం జరిగింది. అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్ పొందాను. ఈ విషయం పై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్ కు వెళ్తున్నాను. రచయిత వంశీ పై నా న్యాయ పోరాటం సాగిస్తాను. టెంపర్ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో,ఏమిటో నాకు నా సినిమా యూనిట్ సినిమా సహాయ రచయితలకు,వంశీ మనసాక్షికి తెలుసు.....,సినిమా రంగంలో నటులకు,దర్శకుల,సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమిది లక్షల రూపాయల చెల్లించలేని స్థితి లో లేనా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకొనగలరు. 

-మీ బండ్ల గణేష్.

loader