Asianet News TeluguAsianet News Telugu

Akhanda: బాలయ్య ఒక ఆటంబాంబ్‌ః రాజమౌళి సంచలన వ్యాఖ్యలు.. బన్నీపై నో కామెంట్‌.. ఫ్యాన్స్ ఫైర్‌

`జై బాలయ్య` అనే పాటని రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, `అఖండ` ఈవెంట్‌ ఇండస్ట్రీకి ఓ ఊపు తెచ్చిందన్నారు. డిసెంబర్ 2 నుంచి కొత్త ఊపు వస్తుందన్నారు.

balayya oka atom bomb said rajamouli in akhanda event and bunny fans fire
Author
Hyderabad, First Published Nov 27, 2021, 9:29 PM IST

బాలయ్యపై దర్శకధీరుడు రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్యని ఆటంబాంబ్‌తో పోల్చారు. ఆయన్ని కరెక్ట్ గా ప్రయోగించడం బోయపాటి శ్రీనుకు మాత్రమే తెలుసు అని తెలిపారు. బాలకృష్ణ హీరోగా రూపొందిన `అఖండ` చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌ విలన్‌గా నటించగా, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్‌ 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ రోజు శనివారం(నవంబర్‌ 27) సాయంత్రం `అఖండ` చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. ఇందులో అల్లు అర్జున్‌తోపాటు రాజమౌళి స్పెషల్‌ గెస్ట్ గా పాల్గొన్నారు. 

ఇందులో `జై బాలయ్య` అనే పాటని రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, `అఖండ` ఈవెంట్‌ ఇండస్ట్రీకి ఓ ఊపు తెచ్చిందన్నారు. డిసెంబర్ 2 నుంచి కొత్త ఊపు వస్తుందన్నారు. బాలయ్య బాబు ఒక ఆటం బాంబ్‌ అని, ఆయన్ని ఎలా ప్రయోగించాలో బోయపాటి శ్రీనుకి మాత్రమే తెలుసు అన్నారు. ఆ సీక్రెట్‌ ఏంటో మాకు చెప్పాలని తెలిపారు. మరోవైపు బాలయ్య ఎనర్జీ లెవల్‌పై ప్రశంసలు కురిపించారు. ఆ ఎనర్జీ సీక్రెట్‌ తమకి కూడా చెప్పాలన్నారు. `జై బాలయ్య` పాటలో అద్భుతమైన డాన్సులు చేశారని, ఆయన ఎనర్జీని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. 

`అఖండ` సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నానని, థియేటర్‌లోనే ఫస్ట్ షోలో ఈ సినిమా చూడాలని వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పారు రాజమౌళి. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని, తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్త ఊపు తీసుకురావాలని తెలిపారు. సినిమాతో థియేటర్లలో పూర్వ వైభవం వస్తుందని తన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఇందులో రాజమౌళి.. బన్నీ గురించి ప్రస్తావించలేదు. ఆయన గురించి ఏం మాట్లాడకుండానే స్టేజ్‌ నుంచి వెళ్లిపోయారు. అంతేకాదు ఈవెంట్‌ నుంచి అయిపోయారు. అయితే చివర్లో బన్నీ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ గురించి మాట్లాడాలని గట్టిగా అరిచారు. కానీ వారి మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు రాజమౌళి. ఎంత అరుస్తున్నా పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని ముగించుకుని ఈవెంట్‌ని వెళ్లిపోవడం గమనార్హం. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో రాజమౌళిపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్‌ అవుతున్నారు. సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు. 

సంగీత దర్శకుడు థమన్‌ మాట్లాడుతూ, బాలయ్య చేస్తున్న సేవలపై ప్రశంసలు కురిపించారు. క్యాన్సర్‌ ఆసుపత్రిపై అనేక మందికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాలయ్య నటించిన `భైరవ ద్వీపం` చిత్రంతోనే తన కెరీర్‌ ప్రారంభమైందన్నారు. తాను రికార్డింగ్‌ చేసిన తొలి చిత్రమన్నారు. ఆ టైమ్‌లో తాను 12ఏళ్ల వయసులో ఉన్నట్టు చెప్పారు. ఈ సినిమాని చూస్తున్నప్పుడు ఆడియెన్స్ సీట్‌ నుంచి లేచి చూస్తారని, కూర్చొని మాత్రం చూడరని, అనేక సందర్భాల్లో నిలబడి ఆడియెన్స్ చూసేలా `అఖండ` ఉంటుందన్నారు థమన్. 

also read: akhanda: బిగువైన ఎద అందాలు ఒప్పొంగగా ప్రగ్యా జైశ్వాల్‌ హాట్‌ లుక్స్.. `అఖండ` ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌

Follow Us:
Download App:
  • android
  • ios