Asianet News TeluguAsianet News Telugu

Akhanda Trailer: బ్రేకుల్లేని బుల్డోజర్ లా తొక్కేస్తా అంటున్న బాలయ్య.... మూడు గెటప్స్ లో నటవిశ్వరూపం

బ్రేకుల్లేని బల్డోజర్ ని తొక్కేస్తా అంటున్నాడు బాలయ్య. మూడు డిఫరెంట్ గెటప్స్ లో నటవిశ్వరూపం చూపించాడు. అఖండ ట్రైలర్ తో అంచనాలు తారాస్థాయికి చేర్చారు.

Balayya looks unstoppable here is most awaited akhanda trailer
Author
Hyderabad, First Published Nov 14, 2021, 8:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలయ్య (Balakrishna ) ఫ్యాన్స్ వేయి కన్నులతో ఎదురుచూస్తున్న చిత్రం అఖండ. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన బాలయ్య వరుస పరాజయాలతో వెనుకబడ్డారు. దీనితో ఆయన సాలిడ్ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. దాని కోసం కలిసి వచ్చిన కాంబినేషన్ ఎంచుకున్నారు. సింహా’,‘లెజెండ్‌’ వంటి బిగ్గెస్ట్‌ హిట్స్‌ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో సినిమా కన్ఫర్మ్ చేశారు.

 బాలకృష్ణ, మ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘అఖండ’ (Akhanda ) పై భారీ అంచనాలు నెలకొనగా, నేడుట్రైల‌ర్ రిలీజైంది. విధికి, విధాత‌కు, విశ్వానికి స‌వాళ్లు విస‌ర‌కూడ‌దు అన్న డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. అంచ‌నా వేయ‌డానికి నువ్వేమైనా పోల‌వ‌రం డ్యామా? ప‌ట్టిసీమ తూమా? పిల్ల‌కాలువ అని డైలాగ్‌తో గ‌ర్జించాడు బాల‌య్య‌. ఆశ చ‌చ్చిపోయిన‌ప్పుడు, న‌మ్మ‌కానికి చోటు లేన‌ప్పుడు, విధ్వంస శ‌క్తులు విరుచుకుప‌డిన‌ప్పుడు అఖండ వ‌స్తాడు, కాపాడ‌తాడు అంటూ బాల‌య్య మ‌రో పాత్రలో చెప్పారు.

Also read నాని ఇచ్చిన సర్ప్రైజ్‌కి ఎమోషనలైన బాలకృష్ణ.. తిరుపతిలో వెంకన్న స్వామి కనిపించడు.. కానీ బాలయ్య కనిపిస్తాడట
మొత్తంగా ట్రైలర్ బోయపాటి మార్క్ యాక్షన్, హైవోల్టెజ్ డైలాగ్స్ తో సాగింది. మెయిన్ విలన్ శ్రీకాంత్ గెటప్ సరికొత్తగా ఉంది. ఓ కొత్త శ్రీకాంత్ ని మనం అఖండ మూవీలో చూడవచ్చు. అలాగే జగపతి బాబు సన్యాసి గెటప్ లో ఆసక్తి రేపారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అఖండ ట్రైలర్ ఉంది. ఇక డిసెంబర్ 2న అఖండ భారీ ఎత్తున విడుదల కానుంది.

Aslo read ‘అన్‌స్టాపబుల్’:మూడో ఎపిసోడ్ కు అన్ ఎక్సపెక్టెడ్ గెస్ట్

ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. తమిళనాడులోని ఓ దేవాలయంలో ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌ను చిత్రీకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios