‘అన్‌స్టాపబుల్’:మూడో ఎపిసోడ్ కు అన్ ఎక్సపెక్టెడ్ గెస్ట్

 రెండో ఎపిసోడ్‏లో న్యాచురల్ స్టార్ నాని వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.  

Vijay Devarakonda is the guest for  Unstoppable With Balayya

ఒకవైపు సినిమాలు.. మరోవైపు రియాల్టీ షోలతో రచ్చ రచ్చ చేస్తున్నారు బాలయ్య(Balakrishna). ఆ క్రమంలో  ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫాంలో  ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable Show)అంటూ ఓ టాక్ షో ని ఓ రేంజిలో లేపుతున్నారు. అన్‌‏స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే పేరుతో ఓ టాక్ షో జరుగుతుంది. ఇప్పటికే తొలి ఎపిసోడ్‏లో మంచు మోహన్ బాబు కుటుంబసభ్యులపై తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు Balakrishna. ఇక రెండో ఎపిసోడ్‏లో న్యాచురల్ స్టార్ నాని(Nani) వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. సెకండ్ ఎపిసోడ్ ఫుల్ వీడియో నవంబర్ 12న స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా బాలకృష్ణ.. అన్‌ స్టాబబుల్‌ మూడో ఎపిసోడ్ కు మరో అదిరిపోయే గెస్ట్ రానున్నట్లు సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. అన్‌స్టాపబుల్ తర్వాతి ఎపిసోడ్లో సందడి చేయబోతున్నాడని సమాచారం.  అల్లు అరవింద్ తో విజయ్‌కి మంచి అనుబంధమే ఉంది. గతంలో వీరి బ్యానర్ లో గీతా గోవిందం వంటి హిట్ వచ్చింది. అలాగే బాలయ్యకు సన్నిహితుడైన పూరి జగన్నాథ్‌తో ప్రస్తుతం విజయ్ ‘లైగర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య బాలయ్య.. ‘లైగర్’ సెట్స్‌కు వెళ్లాడు కూడా. దాంతో ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా ఓ రేంజిలో క్లిక్ అవుతుందంటున్నారు.

ఇక తొలి నుంచీ విజయ్ ఏ వేడుకలో పాల్గొన్నా.. ఏ షోలో అడుగు పెట్టినా అక్కడి వాతావరణాన్నే ఫుల్ జోష్ మోడ్ లోకి మార్చేస్తాడు. తనదైన కామెంట్స్ తో, బిహేవియర్ తో అందరి దృష్టినీ ఆకర్షిస్తాడు. అలాంటి విజయ్ దేవరకొండ... బాలయ్య షోలో పాల్గొంటే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో అని ప్యాన్స్  అంచనా వేస్తున్నారు. బయట మామూలుగా మాట్లాడేటపుడు బాగా తడబడే బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. హుషారుగా షోను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తున్నాడు.
 
నందమూరి బాలకృష్ణను ఒక టాక్ షోలో హోస్ట్‌గా చూస్తామని ఎవ్వరూ ఊహించి ఉండరు. అందులోనూ అది అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆహా కోసం అయ్యుంటుందని అసలే అంచనా వేసి ఉండరు. కానీ ఈ అనుకోని కలయిక సాధ్యమైంది. ‘అన్‌స్టాపబుల్’ పేరుతో బాలయ్య చేస్తున్న టాక్ షో దీపావళికే మొదలైంది. మంచు ఫ్యామిలీ పాల్గొన్న ఈ ఎపిసోడ్‌కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. రెండో ఎపిసోడ్లో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సంబంధించి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

also read: NBK 107: క్రాక్ దర్శకుడితో బాలయ్య మొదలెట్టేశాడు!

అలాగే ఈ షో వల్ల ‘ఆహా’బాగా లాభపడుతోంది. సబ్‌స్క్రైబర్లు చెప్పకోదగ్గ సంఖ్యలోనే పెరిగినట్లుగా తెలుస్తోంది. వ్యూయర్ షిప్ ఒక రేంజ్‌లో ఉందంటున్నారు. తొలి సీజన్ అంతా క్రేజీ గెస్టులతో చాలా హుషారుగా ఎపిసోడ్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  

also read: Akhanda Big Update: బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు స్టార్ట్.. `అఖండ` ట్రైలర్ కి టైమ్‌ ఫిక్స్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios