- Home
- Entertainment
- నాని ఇచ్చిన సర్ప్రైజ్‌కి ఎమోషనలైన బాలకృష్ణ.. తిరుపతిలో వెంకన్న స్వామి కనిపించడు.. కానీ బాలయ్య కనిపిస్తాడట
నాని ఇచ్చిన సర్ప్రైజ్‌కి ఎమోషనలైన బాలకృష్ణ.. తిరుపతిలో వెంకన్న స్వామి కనిపించడు.. కానీ బాలయ్య కనిపిస్తాడట
నేచురల్ స్టార్ నాని.. మాస్‌కి పూనకాలు తెప్పించే బాలయ్యతో చాటింగ్‌లో పాల్గొన్నాడు. అంతేకాదు బాలకృష్ణని ఎమోషనల్‌కి గురి చేశారు. గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసి బాలయ్య భావోద్వేగానికి గురయ్యేలా చేశాడు. ఇప్పుడిది వైరల్ అవుతుంది.

బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`(Unstoppablewithnbk) అనే షోకి హోస్ట్ గా చేస్తున్నారు. Balakrishna సినీ జీవితంలో ఆయన చేస్తున్న మొదటి షో ఇది. `ఆహా`(Aha) ఓటీటీలో ఇది ప్రసారం అవుతుంది. ఇందులో ఇప్పటికే మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ పాల్గొని సందడి చేసింది. ప్రస్తుతం నాని గెస్ట్ గా పాల్గొన్న ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నాని, బాలయ్య మధ్య అనేక ఆసక్తికర చర్చ జరిగింది. అనేక కొత్త విషయాలను పంచుకున్నారు.
బాలయ్య హోస్ట్ గా రన్ అవుతున్న ఈ `అన్‌స్టాపబుల్` టాక్ షోలో బాలయ్యకి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు నాని(Nani). తన బసవతారకం ఆసుపత్రిలో క్యాన్సర్ ట్రీట్‌మెంట్ పొంది కోలుకున్న ఓ పాప ఫ్యామిలీ వీడియోని చూపించాడు నాని. ఇందులో పాప తల్లి తన బాధని వ్యక్తం చేసింది.
తాను చంటిపిల్ల తీసుకుని ఎన్నో ఆసుపత్రులు తిరిగిందట. కానీ ఎక్కడా ట్రీట్‌మెంట్ చేయలేదని, చివరికి చెన్నైకి వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పింది. పాపకి ట్రీట్‌మెంట్ దొరకదేమో అని ఏడ్చానని చెప్పింది. చెన్నై నుంచి వచ్చేటప్పుడు కొందరి వ్యక్తుల ద్వారా బసవతారకం ఆసుపత్రి గురించి తెలిసిందని, వారిని అప్రోచ్ అయ్యామని చెప్పింది. విజయవాడ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్‌గారు ద్వారా బాలకృష్ణగారీ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లినట్టు చెప్పింది.
పాపకి ఆరోగ్య శ్రీ రాకపోయినప్పటికీ.. బాలయ్య దగ్గరుండి కీమో థెరఫీ చేయించారట. మూడు రోజుల్లో ట్రీట్‌మెంట్ జరిగిందని, ఇప్పుడు తమ పాప అందరి ముందు హ్యాపీగా కనిపిస్తుందంటే కేవలం బాలయ్య బాబు గారి వల్లేనూ అని చెప్పింది పాప తల్లి. బాలయ్యగారు లేకపోయి ఉంటే మా పాప ఇలా మా కళ్ల ముందు ఉండేది కాదు. మా ఫ్యామిలీ మొత్తం జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని తెలిపింది.
దీంతో ఇది చూసి బాగుంది, సర్‌ప్రైజ్ అంటూ ఎమోషనల్(Balakrishna Emotional) అయ్యాడు బాలయ్య. దీనికి ఇది మాత్రమే సర్‌ప్రైజ్ కాదు, మరో సర్‌ప్రైజ్ ఉందంటూ ఆ పాపని, వాళ్ల అమ్మని షోకి పిలిపించారు. దీంతో బాలయ్య మరింత ఆనందానికి గురయ్యాడు. ఆ పాప బాలయ్యని చూడగానే అలా పరిగెత్తుకుంటూ వచ్చింది. బాలయ్య ఆ పాపని తీసుకుని హగ్ చేసుకున్నాడు. పాకి ప్రేమతో ముద్దు పెట్టాడు. ఈ సన్నివేశం అందరిని కంటతడిపెట్టించింది.
ఈ సందర్భంగా పాప తల్లి స్పందిస్తూ, తిరుమలలో వెంకటేశ్వర స్వామి కనిపించడని, కానీ బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య కనిపిస్తాడని ప్రశంసలు కురిపించింది. ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. దీనికి బాలయ్య స్పందిస్తూ మీరు సరైన సమయంలో సరైన దేవాలయానికి వచ్చారని, దాన్ని తాను ఎప్పుడూ ఆసుపత్రి అని పిలవడనని, దేవాలయంగానే భావిస్తానని చెప్పాడు బాలకృష్ణ.
ఈ సందర్భంగా నాని ఆ పాపకి ఓ గిఫ్ట్ ఇచ్చాడు. ఇది తనకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెట్టింట చక్కర్లు కొడుతుంది. బాలయ్య గొప్ప మనసుకు అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ ని ఈ రోజు(ఆదివారం) సాయంత్రం ఏడుగంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు శనివారం తన కొత్త సినిమాని ప్రారంభించారు బాలకృష్ణ.
also read: ‘అన్‌స్టాపబుల్’:మూడో ఎపిసోడ్ కు అన్ ఎక్సపెక్టెడ్ గెస్ట్