Asianet News TeluguAsianet News Telugu

శాతకర్ణితో సీతయ్యను గుర్తు చేసిన బాలయ్య

  • గౌటమిపుత్ర శాతకర్ణి చిత్రంలో వయసు మీద పడ్డట్టు స్పష్టంగా కనిపించిన హీరో
  • శాతకర్ణిలో సీతయ్యను గుర్తు చేసిన నటసింహం బాలకృష్ణ
  • షూటింగ్ వేగంగా పూర్తవాలనే తొందరలో కొన్ని కీలక విషయాలను పట్టించుకోని క్రిష్
BALAYYA LOOKS LIKE SEETHAYYA IN SHATAKARNI

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీపై రాను రాను అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. వందో చిత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలకృష్ణ అంతే ప్రతిష్టాత్మకంగా తన బాడీ లాంగ్వేజ్ కూడా తీసుకుని ఉంటే బాగుండేది. ఈ అంశంపై దర్శకుడు క్రిష్ పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. అయితే దానికి కారణం లేకపోలేదు. బాలకృష్ణతో డైలాగులు చెప్పించుకుని సినిమాని లాగేయొచ్చనే ఉద్దేశం అతనిలో ఉన్నట్లు కనిపించింది.

 

ఒక చారిత్రక పురుషుడు అందునా ఒక శకపురుషుడు.. వందల యేళ్ల వరకు భరత ఖండంపై దండయాత్రలకు విదేశీయులు సాహసం చేసేందుకు ఆలోచించేందుకు కూడా జడుసుకునేలా చేసిన ధీరుడు, గౌతమిపుత్రుడు శాతకర్ణి. అంతటి మహనీయుడి గురించి సినిమా తెరకెక్కిందంటే... ఆ మహానుభావుడి చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న సగటు ప్రేక్షకుడు ఈ సినిమా చూడటం ఖాయం. అయితే సినిమా చూసాక.. క్రిష్ యుద్ధాలు తెరకెక్కించారు తప్ప శాతకర్ణికి సంబంధించిన చరిత్ర ఏ మాత్రం సంతృప్తి కలిగించేలా తెరకెక్కించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

 

ఇక చరిత్ర సంగతి అటుంచితే... ఒక యుగ పురుషుడికి ఉండాల్సిన శరీర సౌష్టవం ఈ చిత్ర హీరోలో కనిపించలేదంటే అతశయోక్తి ఎంత మాత్రం కాదు.  శరీర సౌష్టవం మాట అటుంచితే.. కనీసం అంతటి మహానుభావుడి పాత్రలో నటించిన హీరోను ఎలా చూపించాలన్న  అంశంపై దర్శకుడు పెద్దగా శ్రద్ధ పెట్టినట్టు కనిపించదు. అందుకే బాలయ్య శాతకర్ణిలా కాకుండా సీతయ్యలా కనిపించాడు. సీతయ్య ఎవరిమాటా వినడు. అలానే శాతకర్ణి సినిమాలో  బాలయ్య కూడా. ఇంతకీ సీతయ్యకీ బాలయ్యకీ సారూప్యత ఏంటి... ఈ సందర్భంలో ఎందుకు అంటారా... ఎందుకంటే హీరో వయసు మళ్లిన ఛాయలు..శాతకర్ణి చిత్రం  ఫ్రేము ఫ్రేములో కనిపించాయి. బహుశా ఇలాంటి చిన్న చిన్న అంశాలపై కూడా దృష్టి పెట్టకుండా సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా సినిమాను పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేసినందుకే ఈ చిత్రం అంత తక్కువ కాలంతో పూర్తయింది. అయితే మరింత సమయం తీసుకుని ఉండి, హీరో శరీర సౌష్టవంపై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేంది.

ఇక యుద్ధ వ్యూహాలు కూడా బాహుబలి ప్రభావం ఉన్నా,.. ఆస్థాయి వ్యూహాలు మాత్రం కనిపించలేదు. ఏదో యుద్ధాలు పదే పదే సా...గినా.. వాటిలో వ్యూహాలు ఆకట్టుకునే స్థాయిలో కనిపించలేదు. ఇక బాలయ్య కత్తిపట్టిన తీరు కూడా ఒక శక పురుషుడి ఠీవీని మరిపించలేదు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సిగరెట్ తీసి వెలిగించినప్పుడు కనిపించే స్టైల్, ఆ ఫీల్ కూడా ఈ చిత్రంలో ఏ ఫ్రేములో కనిపించలేదు. మరికొంత సమయం తీసుకుని స్క్రీన్ ప్లేని, యుద్ధ వ్యూహాలను మరింత ఆకట్టుకునేలా తీర్చి దిద్ది ఉంటే... శక పురుషుని కథ ఎంచుకున్నందుకు సార్థకత లభించేది. ఏది ఏమైనా సినిమా ట్రయలర్ చూసి ఆనందిద్దాం. శాతకర్ణి సినిమాలో తన చరిత్ర కోసం ఆశలు తగ్గిద్దాం. జయహో శాతకర్ణి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios