తాత-మనవడి ఫోటో వైరల్!

balakrishna with his grandson devansh pic goes viral
Highlights

నందమూరి బాలకృష్ణ నిన్న 58వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. 

నందమూరి బాలకృష్ణ నిన్న 58వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున బాలయ్య ఇంటికి చేరుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు తన కుటుంబంతో కూడా సమయం గడిపాడు బాలయ్య.

ఆయన పెద్ద కుమార్తె బ్రాహ్మణి-లోకేష్ ల కుమారుడు దేవాన్ష్ తన తాతయ్యతో కేక్ కట్ చేయించాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవాన్ష్ తన తాతకు కేక్ తినిపిస్తూ క్యూట్ గా కనిపిస్తున్నాడు.

రీసెంట్ గా దేవాన్ష్ మూడేళ్లు పూర్తి చేసుకొని నాలుగో ఏట అడుగుపెట్టాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. దర్శకుడు క్రిష్ తో 'ఎన్టీఆర్' బయోపిక్ అలానే మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తో ఓ కమర్షియల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య.

loader