పైసా వసూల్ చిత్రం ప్రమోషన్ లో స్టంపర్ పూరీ కొత్త కాన్సెప్ట్ స్టంపర్ తో ఫ్యాన్స్ గందరగోళం స్టంపర్ లో బాలయ్య వాయిస్ విని హర్ట్ అయిన ఫ్యాన్స్
నటసింహం బాలకృష్ణ, పూరీల ‘పైసా వసూల్' స్టంపర్ నిన్న విడుదల అవడంతో ఆ టీజర్ ను చూసిన వారు అంతా బాలకృష్ణ పై పూరి ఆవహించాడా అని కామెంట్స్ చేసారు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ లో స్పష్టమైన మార్పు కనిపించడమే కాకుండా ఈ టీజర్ ద్వారా బాలయ్యను నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి పూరి తనదైన స్టైల్ లో కనెక్ట్ చేయడానికి ప్రయత్నించాడు.
టీజర్ కీ ట్రైలర్ కీ మధ్యలో అన్నట్లుగా ఒక కొత్త పదాన్ని కనిపెట్టి 'స్టంపర్' అంటూ పూరి పెద్ద ప్రయోగమే చేసినా ఆ ప్రయోగం ఎంత వరకు సక్సస్ అవుతుంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మాస్ ప్రేక్షకులను ముఖ్యంగా నందమూరి అభిమానులను మెప్పించడానికి బాలకృష్ణతో పెద్ద మ్యాజిక్ పూరి జగన్నాథ్ చేయించాడు అన్న విషయం ఈ ట్రైలర్ ను చూసినవారికి అనిపిస్తుంది.
అయితే నందమూరి అభిమానులను పూర్తిగా జోష్ లో పెట్టడానికి పూరి చేసిన ప్రయోగం చూసి బాలకృష్ణ అభిమానులలోని ఒక వర్గం భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం బాలయ్య డైలాగులు చెప్పే విషయంలో తన స్పెషాలిటీ చూపెట్టినా ఎప్పుడూ లేని విధంగా బాలయ్య గొంతు బొంగురు పోయి ఉండటంతో ఆ బొంగురు పోయిన గొంతుతో బాలయ్య చెప్పిన డైలాగ్ వినడం కష్టంగా అనిపించింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే వెరైటీ కోసం పూరి బాలయ్య గొంతును ఇలా మార్చాడా ? లేదంటే బాలయ్య గొంతుకు ఏమైంది అంటూ బాలకృష్ణ అభిమానులు కలవర పడుతున్నట్లు టాక్. ఈమధ్య ఈ సినిమాకు సంబంధించి విదేశాలలో ఈసినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలయ్య గొంతు బొంగురు పోయింది అన్న వార్తలు వచ్చాయి.
ఈ సమస్య నుండి బాలయ్య ఇంకా పూర్తిగా తెరుకోకపోవడంతో అతడి గొంతు ఈ టీజర్ లో ఇలా ఉంది అని బాలకృష్ణ అభిమానులు సరిపెట్టుకుంటూ ఉన్నా సినిమాలో అంతా ఇదే తరహాలో బాలయ్య గొంతు వినిపిస్తే తట్టుకోగలమా ? అని బాలయ్య అభిమానులు మధన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా పూరి ప్రయోగంలో బాలయ్య పూర్తిగా చిక్కుకున్నాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి.
అయితే పూరీ కనిపెట్టిన ఈ స్టంపర్ కాన్సెప్ట్ కేవలం రష్ లోంచి తీసిందేనని.. అసలు డైలాగ్స్ అన్నీ వేరే వున్నాయని విశ్వసనీయ సమాచారం.
