సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన నందమూరి హరికృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఇది తీరని లోటు. ఇప్పటికే ఆయన మరణవార్త తెలిసిన ప్రతి ఒక్కారూ కామినేని ఆసుపత్రికి చేయుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

సీనియర్ హీరో మోహన్ బాబు.. 'ఈరోజు నా సోదరుడిని కోల్పోయాను. ఇంతకన్నా ఏమీ మాట్లాడలేను' అంటూ ట్వీట్ చేయగా.. దర్శకుడు వైవిఎస్ చౌదరి మరింత ఎమోషనల్ అయ్యారు. హరికృష్ణతో వైవిఎస్ కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. హరికృష్ణ హీరోగా వైవిఎస్ 'సీతారామరాజు','లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య' అనే సినిమాలను రూపొందించారు. ఈ మూడు సినిమాలు అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. 'సీతయ్య' హరికృష్ణ కెరీర్ లో బెస్ట్ ఫిలింగా నిలిచింది

ఆయన మరణంతో దిగ్భ్రాంతి చెందిన వైవిఎస్.. ''పొద్దున్నే.. నైరాశ్యం.. వైరాగ్యం.. మనసుతో పాటు శరీరంలో అణువణువు బాధ పడుతుంది. తీర్చేవారు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు.. ఈరోజు.. తనకు నచ్చితే అచంచలమైన నమ్మకాన్ని పెంచుకునే నా 'సీతయ్య'.. ఇట్లు ఆయన వైవిఎస్ చౌదరి'' అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.