హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి2 ది కన్ క్లూజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కనీ వినీ ఎరగని రీతిలో ఈవెంట్ నిర్వహించిన బాహుబలి టీమ్
బాహుబలి 2 రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 28న విడుదల కానున్న బాహుహలి 2 ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాహిష్మతి సామ్రాజ్యం సెట్ వేసిన చోటనే ఈవెంట్ నిర్వహించిన బాహుబలి టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్ నే కాక యావన్మంది తెలుగు ప్రేక్షకులను అలరించింది.
ఈ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. యాంకర్ సుమ యాంకరింగ్ తో ఈవెంట్ చాలా పక్కాగా పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలో వేలాది మంది బాహుబలి అభిమానులు హాజరు కాగా... ఈవెంట్ తెలుగు సినీ చరిత్రలోనే ఏ ఆడియో ాకానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇలా జరగలేదు. ఫైర్ క్రాకర్స్ తో అదరహో సాహో బాహుబలి అనిపించారు.
ఈవెంట్ హైలైట్స్...
వేదికపైకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తీరు అద్భుతంగా అనిపించింది
కీరవాణి జక్కన్న రాజమౌళి కోసం పాడిన పాట సాహో అనిపించింది
రానా, ప్రభాస్ లు ఎంట్రీ సందర్భంగా కాలకేయులు, మాహిష్మతి సైన్యం నృత్యాలు అలరించాయి.
క్రాకర్స్ తో చివరగా ఈవెంట్ ముగింపు వేడుక కన్నుల పండుగలా సాగింది.
ప్రముఖులెందరో హాదరుకాగా కరణ్ జోహార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
అనుష్క, తమన్నాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. నాని ఫ్యామిలీతో వచ్చాడు.
