Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి2 టికెట్ ధరలకు దిమ్మదిరిగి మైండ్ "బ్లాక్" అవుతోంది

  • బాహుబలి2 టికెట్ ధరలకు దిమ్మదిరిగి మైండ్ "బ్లాక్" అవుతోంది
  • తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధర4000 వరకు పలికినట్టు సమాచారం
bahubali storm tickets fever still continues

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదలౌతున్న బాహుబలి2 మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూసారో తెలిసిందే. రిలీజ్ డేట్ తర్వాత ఆ ఎదురు చూపులు తగ్గుతాయనుకుంటే.. ఏ మాత్రం తగ్గకపోగా పెరిగాయి. రిలీజ్ డేట్ నాడు టికెట్స్ కోసం జనం నిలబడ్డ క్యూలు రైళ్లను తలపించాయి. బాహుబలి పార్ట్1 సాధించిన సెన్సేషన్స్‌తో పార్ట్‌2 అంతకు మించిన రేంజ్‌లో ఉండటం ఖాయం అనే హైప్ క్రియేట్ కావడంతో ప్రేక్షకులు బాహుబలి ది కన్‌క్లూజన్‌ని తెరపై చూసి ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

 

అంతేకాకుండా ఈ సినిమా బాహుబలి పార్ట్1 వన్ కంటే పెద్ద హిట్ పక్కా అనే ప్రచారం విపరీతంగా జరుగుతుండటంతో ఈ సినిమా చూడటం కోసం ప్రేక్షకులు ఇప్పటికే థియేటర్స్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా థియేటర్స్ వద్ద జనం బారులు తీరారు. క్యూ లైన్‌లో తోపులాటలు, పలు గొడవలు జరుగుతున్నాయి.

 

మరోవైపు బాహుబలి2 టికెట్స్ అడ్వాన్స్ బుక్కింగ్ చేసుకుందామనుకుని ఆన్ లైన్ లో ప్రయత్నిస్తున్న వారికి తీవ్ర నిరాశే మిగులుతోంది. అవసరమున్న వారి కోసం టికెట్స్ అన్నీ బ్లాక్ చేయడంతో పాటు.. బ్లాక్‌ మార్కెట్‌లో బాహుబలి 2 టికెట్ దందా జోరుగా నడుస్తుండటంతో సాధారణ ప్రేక్షకుడికి బాహుబలి2 టికెట్ అందని ద్రాక్షగా మారింది. ఇది కేవలం ఓ చిన్న థియేటర్ కో, కాంప్లెక్స్ కో పరిమితతం కాలేదు. అన్ని చోట్ల అంటే.. బడా బడా వ్యాపార సంస్థలు నిర్వహించే మల్టీ ప్లెక్స్ ల టికెట్స్ కూడా టికెట్ బుకింగ్ సైట్స్ లో లభించడంలేదు. మరోపక్క అందుబాట్లో టికెట్లు ఉన్నట్లు చూపిస్తున్న కొన్ని చోట్ల కూడా బుక్ చేద్దామంటే వినియోదారులకు దొరక్కుండా సర్వర్ కనెక్ట్ కాకుండా చుక్కలు చూపిస్తున్నారు. ఇలా బుక్ మైషో, జస్ట్ టికెట్, పే టీఎం, పీవీఆర్ సినిమా, ఐమాక్స్, ఐనాక్స్, సినిపోలీస్ లాంటి అన్ని సైట్లలో అదే తంతు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సర్కారు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తుండటంతో ప్రేక్షకులకు టికెట్ కష్టాలు తప్పడంలేదు.


ఇక టికెట్ కౌంటర్స్ వద్ద టికెట్ కొనాలన్నా దాదాపు అదే పరిస్థితి. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్, జివికె ఐనాక్స్, పివిఆర్ సినిమాస్, బిగ్ సినిమాస్, సినిమ్యాక్స్‌ దగ్గర పరిస్థితి ఇలాఉంటే.. విజయవాడలోనూ పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. బాహుబలి2 టికెట్స్ రేటును విపరీతంగా పెంచేయడంతో పాటు క్యూలైన్‌లో ఉన్న ప్రేక్షకులకు టికెట్ దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు విజయవాడ శైలజ థియేటర్ వద్ద ధర్నాకు దిగే వరకూ పరిస్థితి వచ్చిందంటే బాహుబలి2 మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో  టికెట్ ధర రూ.4000 వరకు కూడా పలుకుతుండటంతో సినీ ప్రేమికులకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios