భోజ్ పురి "బాహుబలి"లో హిరోయిన్ గా ఆమ్రపాలి

First Published 21, Dec 2017, 7:28 PM IST
bahubali movoe copied by bhojpuri actor dinesh lal yadav
Highlights
  • బాహుబలి మూవీని భోజ్ పురిలో కాపీ కొడుతతున్నారా?
  • హక్కులు కొనక్కున్నట్లు ప్రచారం చేసుకుంటున్న భోజ్ పురి నటుడు దినేష్ లాల్
  • కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసి హల్ చల్
  • ఈ మూవీలో ఆమ్రపాళి హిరోయిన్ గా నటిస్తోంది

'బాహుబలి' చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి భారత దేశ సినీ చరిత్రలో కలెక్షన్ల రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.  రూ. 1000 కోట్లు వసూలు చేసిన తొలి ఇండియన్ చిత్రంగా ఇది రికార్డుల కెక్కింది. తాజాగా బాహుబలిని కాపీ కొడుతూ ఓ భోజ్‌పురి సినిమా రాబోతోంది.

 

భోజ్‌పురిలో ‘వీర్‌ యోధ మహాబలి' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. భోజ్‌పురి నటుడు దినేష్ లాల్‌ యాదవ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇక్బాల్‌ భక్ష్ దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి సినిమాకు రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది రీమేక్ సినిమా అని అఫీషియల్ ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ తాను బాహుబలి సినిమా హక్కులు దక్కించుకున్నట్లు దినేష్ లాల్‌ యాదవ్‌ ప్రచారం చేసుకుంటున్నారట.

 

ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఆ ఫోటోలు చూస్తుంటే బాహుబలి సినిమాను సీన్ టు సీన్ కాపీ కొడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహారాష్ట్రలోని ఓ విలేజ్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో దినేష్ లాల్ యాదవ్ సరసన హీరోయిన్ గా ఆమ్రపాలి దూబె నటిస్తోంది. ఆమ్రపాలి అంటే మన వరంగల్ అర్బన్ కలెక్టర్ అనుకునేరు. ఈ ఆమ్రపాళి అక్కడి హీరోయిన్.

 

జనవరి 15న టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీజర్ విడుదలైన తర్వాత సినిమా గురించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జై లవ కుశ సీన్ కూడా కాపీ కొట్టినట్లు తెలుస్తోంది. దినేష్ లాల్‌ యాదవ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘సౌగంధ్' అనే సినిమా త్వరలో రాబోతోంది. అందులో జైలవకుశ పైట్ ఈ సీన్ ఉంది. ‘జై లవ కుశ' సినిమాలో.. చేతిలో గొడ్డలితో సహా ఉన్నది ఉన్నట్లు కాపీ కొట్టి పోస్టర్ కటౌట్ పెట్టేశారు. మొత్తంమీద తెలుగు సినిమాలు భోజ్ పురి నటుడికి కల్పవృక్షంలా మారుతున్నాయి.

loader