2017లో గూగుల్ ప్లే స్టోర్ టాపర్ గా నిలిచిన బాహుబలి2

bahubali movie still creating records
Highlights

  • 2017లో సంచలన చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి2
  • బాహుబలి చిత్రం గూగుల్ ప్లే స్టోర్ లోనూ టాపర్
  • అత్యధిక మంది వెతికిన పాటగా సాహోరే బాహుబలి సాంగ్

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి చిత్రం తన హవా కొనసాగిస్తూనే వుంది. తాజాగా 2017లో గూగుల్‌ ప్లేలో అత్యధికంగా వీక్షించిన పాటగా ‘సాహోరే బాహుబలి’ రికార్డుకెక్కింది. అంతేకాదు గేమ్‌ కూడా స్థానికంగా రూపొందించిన ‘బాహుబలి: ది గేమ్‌’ టాప్‌ లో నిలిచింది.

 

అంతర్జాతీయ గేమ్‌లైన ‘డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్స్‌’, ‘సూపర్‌ మ్యారియో రన్‌’, ‘పోకెమాన్‌ డ్యుయల్‌’ గేమ్‌లను దాటి బాహుబలి టాప్‌ స్థానంలో ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని గూగుల్‌ శుక్రవారం వెల్లడించింది. ఇక బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డియర్‌ జిందగీ’ చిత్రం 2017 గూగుల్‌ ప్లేలో పాపులర్‌ చిత్రంగా నిలిచింది.

 

‘డియర్‌ జిందగీ’ తర్వాత ‘మోనా’, ‘వండర్‌ ఉమెన్‌’ చిత్రాలు ఉన్నాయి. ఇక యాప్‌ల విషయానికి వస్తే ‘ఫొటో ఎడిటర్‌- బ్యూటీ కెమెరా, ఫొటో ఫిల్టర్స్‌’, ‘మెసెంజర్‌ లైట్‌’ యాప్‌లు టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక పుస్తకాల్లో.. రిషి కపూర్‌, కరణ్‌ జోహార్‌, రఘురామ్‌ రాజన్‌ల జీవితాధారంగా వచ్చిన పుస్తకాలు టాప్‌ స్థానాలు దక్కించుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ టాప్‌ స్థానంలో ఉంది.

loader