బాహుబలి అనే పదం వినగానే... ఇప్పుడు ఎవ్వరికైనా సరే ఫస్ట్ మదిలో తట్టే ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. అని. అయితే ఈ ప్రశ్న కేంద్ర మంత్రిని కూడా వేధిస్తూ ఉండేదట. కానీ జక్కన్న రాజమౌళి ఆ కేంద్ర మంత్రి మైండ్ ను తొలిచేసిన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి కేంద్ర మంత్రిని తన పని చేసుకునేటట్ల రిలీజ్ జేషిండట.

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందించిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇక‌ క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చెప్పాడు అనేది కూడా అదే స్ధాయిలో హాట్ టాపిక్ అయ్యింది. దీనికి స‌మాధానం ఏమిటి అని రాజ‌మౌళిని అడిగితే...బాహుబ‌లి 2 వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే అనేవారే త‌ప్ప స‌మాధానం చెప్పేవాళ్లెవరూ లేరు. ఎవరికి తోషింది వాళ్లి చెప్పి పరేషాన్ చేస్తున్నరు.

ఐతే.. ఇగ..గోవాల జ‌రుగుతున్న 47వ అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వంకు రాజ‌మౌళి ముఖ్య అతిధిగా హాజ‌రయ్యారు. కార్య‌క్ర‌మానికి కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ స‌హాయ మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ రాథోడ్ కూడా హాజ‌రయ్యారు. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అని రాజ‌మౌళిని కేంద్ర‌మంత్రి రాథోడ్ అడ‌గా అస‌లు విష‌యం చెప్పేసార‌ట‌.

కేంద్ర‌మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ రాథోడ్ వేదిక పై మాట్లాడుతూ....క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో నాకు తెలుసు. రాజ‌మౌళి చెప్పిన ఆ ర‌హాస్యం  నా ద‌గ్గ‌ర భ‌ద్రంగా ఉంది. నాకు ఆ ర‌హాస్యాన్ని చెప్పిన రాజ‌మౌళికి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

సారూ మరి గా ప్రశ్న బట్టుకోని.. అంతా.. మీ ఎంబటి బడ్తరేమో.. అసలే గా ఏటీఎంల కాడ క్యూలు గట్టలేక సస్తుంటే.. నీ ఎంబటి క్యూలు గట్టించుకుందమని గిట్ల జెప్తున్నవా.. జర పైలం. అసలే మనోళ్లు మంట మీదున్రు.