జపాన్ లో బాహుబలి ది కన్ క్లూజన్ రిలీజ్ సందడి.. పోస్టర్స్ చూశారా

bahubali japan hungama
Highlights

  • దేశవ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డులు బద్దలు కొట్టిన బాహుబలి ది కన్ క్లూజన్ చిత్రం
  • ఈ మూవీని పలు దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు
  • తాజాగా జపాన్ లో రిలీజ్ కు సిద్ధమైన బాహుబలి, ప్రమోషన్ జోరు

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన జక్కన్న రాజమౌళి, ప్రభాస్,అనుష్క,రానాల బాహుబలి చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలై ఇండియాలోనే కాక ప్రపంచంలో పలు దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.1700 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృఫ్టించిందీ బాహుబలి ది కన్ క్లూజన్ సినిమా.

 

‘బాహుబలి: ది బిగినింగ్’ తరహాలోనే ముందు ఇండియాలో.. కొన్ని దేశాల్లో సినిమాను రిలీజ్ చేసి.. ఆ తర్వాత మిగతా దేశాలపై దృష్టిసారించింది చిత్ర బృందం. చైనాలో ‘ది కంక్లూజన్’ను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు కానీ.. అనివార్య కారణాల వల్ల అక్కడ ఇంకా ఆ చిత్రం రిలీజ్ కాలేదు. ఐతే ఇప్పుడు మరో ఆసియా దేశం జపాన్ లో ఈ చిత్రం పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతోంది.

 

 ‘బాహుబలి: ది కన్క్లూజన్’ డిసెంబరు 29న జపాన్ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. గత కొన్నేళ్లుగా దక్షిణ భారతీయ సినిమాలకు జపాన్ లో ఆదరణ బాగా పెరిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్ అక్కడ కూడా సూపర్ స్టారే. ఆయన సినిమాలు భారీ ఎత్తున రిలీజవుతాయి. ఫ్యాన్స్ పండగలు చేసుకుంటారు. ఇక తెలుగు స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్లో మంచి ఫాలోయింగ్ ఉంది.

 

మరోవైపు ‘బాహుబలి: ది బిగినింగ్’ జపాన్లో మాంచి వసూళ్లు సాధించింది. ‘ బాహుబలి ది కన్క్లూజన్’ కూడా అక్కడ సూపర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. పబ్లిసిటీ కూడా బాగానే చేస్తున్నారు. ఈ రోజు ‘బాహుబలి-2’ జపాన్ లాంగ్వేజ్ పోస్టర్ కూడా లాంచ్ చేశారు. జపాన్ తర్వాత త్వరలోనే చైనా సహా మరి కొన్ని దేశాల్లోనూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజ్ చేసే అవకాశముంది.

 

loader