బాహుబలి సినిమాకు గ్రాఫిక్స్ ఎంత కీలకమో తెలిసిందే. దర్శకుడు జక్కన్న బాహుబవలి కోసం ప్రపంచ వ్యాప్తంగా 33 టీమ్ లను బాహుబలి గ్రాఫిక్ డిజైనింగ్ కోసం రిక్రూట్ చేశాడు. దీంతో బాహుబలి 2 గ్రాఫిక్స్ ఖర్చు మరింత పెరిగిందట. ఖర్చుతోపాటు పని చేసే టైమ్ కూడా చాలా పెరిగుతోందట. దీనికి కారణం తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. అది మరెవరో కాదు హీరోయిన్ అనుష్క. 

 

అవును. బాహుబలి గ్రాఫిక్స్ కోసం అనుష్క కూడా ఖర్చు పెట్టిస్తోందట. సైజ్ జీరో సినిమా తరువాత అనుష్క ఓ రేంజ్ లో వళ్లు చేసింది. అనుష్క ఫిజిక్ తగ్గితే బాహుబలి 2 బ్యాలెన్స్ వర్క్ చేద్దామని రాజమౌళి చాలా కాలం వెయిట్ చేశాడని వినిపించింది. కానీ స్వీటీ ఫిజిక్ రాజమౌళి ఆశించిన మేరకు తగ్గలేదు. ఆఖరికి ఎలాగోలా వర్క్ ఫినిష్ చేసేసారు. అలా షూటింగ్ అయితే పూర్తయింది కానీ ఇప్పుడు అనుష్క ముఖంలోని ఛబ్బీనెస్ ను, బాడీలో ఎక్స్ ట్రా  ఫ్యాట్ ను స్క్రీన్ మీద కనిపించకుండా చేసేందుకు గ్రాఫిక్స్ జనాలకు అదనపు పని అప్పగించారట. 

 

అనుష్కను వీలయినంత స్లిమ్ గా, అందంగా చూపించే పనిలో ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ వీరులు బిజీగా వర్క్ చేస్తున్నారట. ప్రతిష్టాత్మక చిత్రంలో ఏ మాత్రం లోపం కనిపించకుండా ఉండాలని రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో అనుష్క నడుము సన్నగా కనిపించడంపై అంతా ఆశ్చర్పోతున్న నేపథ్యంలో... ఆ ఆశ్చర్యానికి సమాధానం చెప్పేలా అనుష్క రూపాన్ని చెక్కాలని గ్రాఫిక్ డిజైనర్స్ కు సూచించాడట జక్కన్న. మరి ఎంత వరకు సక్సెస్ అవుతారో.. అనుష్క ఎలా కనిపిస్తుందో తెరపైనే చూడాలి.