మాహిష్మతిలోనే బాహుబలి వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు బాహుబలి సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో మాహిష్మతి సెట్ మాహిష్మతిలోనే .. అభిమానులను పిలిచి మొత్తం టీమ్ సమక్షంలో ఆడియో రిలీజ్

‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదల తేదీ దగ్గర పడుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఇక ప్రమోషన్ ఎలా చేయాలన్న ప్లానింగ్‌లో పడిపోయింది బాహుబలి బృందం. ఇందులో భాగంగా ముందు ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ఈ నెల 15న ముంబయిలో జరిగే ఒక మెగా ఈవెంట్లో ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ విడుదలవుతుంది.

 

ట్రైలర్ విడుదలయ్యాక జరిగే ముఖ్యమైన ఈవెంట్ ఆడియో రిలీజ్. ఈ వేడుకను విశాఖపట్నంలో చేయాలని ముందు అనుకున్నప్పటికీ ఆ తర్వాత జక్కన్న మనసు మారిపోయింది. రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి సెట్టింగ్ మధ్యే ఈ వేడుకను చేయడానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి.



మహిష్మతి రాజ్యమున్న ప్రధాన సెట్టింగ్‌లోనే ఆడియో వేడుకను చేయడానికి బాహుబలి బృందం నిర్ణయించిందట. ఇంకెక్కడో వేడుక చేయడం కంటే బాహుబలి సెట్టింగ్‌లోనే ఆడియో ఫంక్షన్ చేస్తే యాప్ట్‌గా ఉంటుందని.. మరింత క్రేజ్ వస్తుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒక కాన్సెప్ట్ ప్రకారం క్రియేటివ్‌గా ఈ వేడుకను చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఎప్పట్లాగే యాంకర్ సుమే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనుందని సమాచారం. బాహుబలి చిత్రంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ ఈ వేడుకకు హాజరు కానున్నారు.