Asianet News TeluguAsianet News Telugu

గంటకో మిలియన్... బాహుబలి దెబ్బకు రికార్డులు గల్లంతు

  • గురువారం ఉదయమే రిలీజైన బాహుబలి ట్లైలర్
  • గంటకో మిలియన్ వ్యూస్ తో రికార్డులు బద్దలు కొట్టిన ట్రైలర్
  • ఇకపై బాహుబలి సినిమానే టాలీవుడ్ రికార్డ్ బెంచ్ మార్క్
bahubali 2 trailer creates sensational records

తెలుగు సినిమా చరిత్రలో ట్రైలర్ వ్యూస్ రికార్డులన్నీ బద్ధలయ్యాయి. ఖైదీ, కాటమరాయుడు మాత్రమే కాదు.. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు కూడా ఇన్ని వ్యూస్ ఇంత రికార్డు సమయంలో నమోదు చేసుకున్న చరిత్రలేదు. చరిత్ర తిరగరాయడం అప్పుడప్పుడు జరుగుతుంది కానీ  చరిత్ర సృష్టించడం ఒక్కసారే. ఇప్పుడు బాహుబలి 2 ట్రైలర్ రిలీజయ్యాక అదే జరిగింది. యూ ట్యూబ్ వ్యూస్ నంబర్ లో గత రికార్డులన్నీ చెరిపేసి అనేకంటే... గల్లంతు చేసి..మరీ సత్తా చాటింబి బాహుబలి 2.

 

బాహుబలి- ద కన్‌క్లూజన్ ట్రైలర్ సగం రోజులోనే కోటికి పైగా వ్యూస్ దాటుకుని గంటల్లో రికార్డు సృస్టించి చరిత్ర పుటలు లిఖించింది. గంటలో రెండు మిలియన్ వ్యూస్ దాటిన ట్రైలర్.. మరో మూడు గంటలు గడిచాక అందుకోలేనంత స్థాయికి దూసుకెళ్లిపోయింది. గంటకు 12 లక్షల వ్యూస్ తో చరిత్ర సృష్టించింది. సెకనుకు 333 మందికి పైగానే సగటున బాహుబలి ట్రైలర్ చూశారు. ఇది కేవలం తెలుగు ట్రైలర్ రికార్డు మాత్రమే.

 

మామూలుగా ఓ ట్రైలర్‌కు మిలియన్ వ్యూస్ రావాలంటే కనీసం పది గంటలు సమయం పట్టడం ఇప్పటి  దాకా చూశాం. కానీ, గంటకు పన్నెండు లక్షల చొప్పున వ్యూస్‌ను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్లిపోతోంది బాహుబలి- ద కన్‌క్లూజన్ ట్రైలర్. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో పోస్టయిన భారత్ సినిమా ట్రైలర్లలో అత్యధిక వ్యూస్ షారూక్ ఖాన్ రాయిస్ సినిమాకు వచ్చాయి. దాన్ని బాహుబలి అధిగమించి రికార్డు సృష్టించింది. తొమ్మిది గంటల్లో బాహుబలి కోటి వ్యూస్‌ను సాధించిన బాహుబలి ట్రైలర్ పన్నెండు గంటల్లో పన్నెండు మిలియన్ వ్యూస్ సాధించి రికార్డులన్నీ బద్దరలు కొట్టింది.

 

మామూలుగా అయితే ఓ సినిమాకు సంబంధించి ట్రైలర్‌కు కోటి వ్యూస్ రావాలంటే దాదాపు నెల రోజులపైనే పడుతుంది. కోటి మంది అలాంటిది ఒక్కరోజు కూడా గడవలేదు.. ఒక్క రోజు దాకా ఎందుకు పది గంటలైనా కాలేదు ట్రైలర్ విడుదలై.. కోటి మంది బాహుబలి-2 ట్రైలర్‌ను చూసేశారు చూస్తూనే ఉన్నారు. గంటల్లో ఫిగర్ మారిపోతేనే అది ఓ అద్భుతం. కానీ, నిముషాల్లోనే లక్షలకు..లక్షల వ్యూస్‌ను కొల్లగొట్టేస్తోంది జక్కన్న చెక్కిన బాహుబలి-2 ట్రైలర్. మొత్తంగా ఇప్పటిదాకా 12,827,345 మంది ఈ ట్రైలర్‌ను చూశారు.

 

ఇకపై యూట్యూబ్‌ లో కూడా నాన్‌ బాహుబలి రికార్డులు అని చెప్పుకోవాల్సిందే. ఇక రిలీజయ్యాక బాహుబలి సినిమా రికార్డుల పరంపర ఎలా కొనసాగుతుందో ఎక్కడ ముగుస్తుందో...ఊహకందనిదే.

Follow Us:
Download App:
  • android
  • ios