చైనాలో తెలుగు సినిమా సత్తా... 7000 థియేటర్లలో బాహుబలి 2

Bahubali 2 to release in 7000 theatres
Highlights

చైనా తెలుగు సినిమా సత్తా... 7000 థియేటర్లలో బాహుబలి 2

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రంగా 'బాహుబలి 2' ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ అక్కడి ప్రేక్షకులతో 'జయహో' అనిపించుకుంది. అలా ఇటీవల జపాన్ లో విడుదలైన ఈ సినిమా, 100 రోజులను పూర్తి చేసుకుని, ఇంకా అదే జోరును కొనసాగిస్తోంది. వసూళ్ల విషయంలోను అదే విధంగా హల్ చల్ చేస్తోంది.

 ఇక చైనాలో రేపు ఈ సినిమా 7000 పైగా స్క్రీన్లలో విడుదల కానుంది. చైనాలో ఐమాక్స్ ఫార్మేట్ లో విడుదలవుతోన్న ఇండియన్ సినిమాగా, ఇప్పటికే ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను కూడా విశేషంగా అలరించడం ఖాయమనీ .. కొత్త రికార్డులకు తెరదీసి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

loader