Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి సినిమా రజినీకాంత్ రోబో 2.0 రిలీజ్ తేదీని మారుస్తుందా

  • దేశవ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డులు మోగించిన బాహుబలి2
  • బాహుబలి 2 తర్వాత కలెక్షన్స్ పరంగా కొత్త టార్గెట్స్
  • జనవరి25న రిలీజ్ కు ప్లాన్ చేసిన రజినీ రోబో2.0
  • బాహుబలి ఎఫెక్ట్ తో రిలీజ్ తేది మార్చే యోచనలో 2.0టీమ్
baahubali set big target to raajinikanth robo 2

బాహుబలి చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలకు సరికొత్త టార్గెట్స్ నిర్దేశించింది. దక్షిణాది నుంచి హిందీలో రిలీజై ఖాన్ ల సినిమాలకంటే అత్యధిక కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది బాహుబలి. బాలీవుడ్ ఖాన్ లు సైతం అసూయ పడేలా చేసిన బాహుబలి ఇటు దక్షిణాదిలోనూ బడా హీరోలకు కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. బాహుబలి పార్ట్ 2 కలెక్షన్స్ రికార్డుల మోత మోగక ముందు బాహుబలి పార్ట్ 1 కలెక్షన్స్ పెద్దగా ఇబ్బంది పెట్టేవి కాదులే అనుకుంటూ...  రజనీకాంత్‌, శంకర్‌ల 'రోబో' సీక్వెల్‌ సెట్స్‌ మీదకి వెళ్లింది. అప్పుడు టార్గెట్ చిన్నదే.

 

'బాహుబలి: ది బిగినింగ్‌'ని మించిన సక్సెస్‌ సాధించాలనే టార్గెట్ తో అక్షయ్‌కుమార్‌ని విలన్‌గా పెట్టుకుని, భారీ బడ్జెట్‌ కేటాయించుకుని '2.0'ని సెట్స్‌ ఎక్కించారు. తీరా ఆ చిత్రం పూర్తి కాకముందే టార్గెట్‌ని మూడింతలు చేస్తూ 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సంచలనం నమోదు చేసింది.

 

'బాహుబలి 2' రికార్డుల తర్వాత ఇప్పుడు అంచనాలైతే ఓ రేంజ్‌లో వున్నాయి. రజనీకాంత్‌, శంకర్‌ కలిసి ఇంత భారీ బడ్జెట్‌ చిత్రంతో 'బాహుబలి 2'ని దాటలేకపోతే ఫెయిలైనట్టేనని అభిమానులు ఫీలవుతున్నారు. పైగా అక్షయ్‌కుమార్‌ వల్ల బాలీవుడ్‌ అడ్వాంటేజ్‌ కూడా వుండడంతో '2.0' టీమ్‌పై  ఒత్తిడి కూడా అంతకు మించి వుంది. రిలీజ్‌ టైమింగ్‌ నుంచి, ప్రీ రిలీజ్‌ పబ్లిసిటీ వరకు అన్నిట్లోను జాగ్రత్తలు తీసుకోకపోతే బాహుబలి 2 రికార్డులని కొట్టినా లేకున్నా, దానికి దగ్గరగా వెళ్లడం కూడా '2.0'కి కష్టమవుతుంది.

 

నిజానికి రోబో 2.0ను జనవరి 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే వేసవిలో విడుదల చేయడం వల్ల అడ్వాంటేజ్‌ ఎక్కువ వుంటుందని భావిస్తున్నారట. బాహుబలి 2 వేసవిలో విడుదల కావడం వల్ల నాలుగు వారాల పాటు అన్ని భాషల్లో పోటీలేకుండా రన్ అయింది. అందుకే 2.0కి కూడా అదే బెస్ట్‌ థియరీ అనుకుంటున్నారట. మరి వేసవిలో  రిలీజ్ చేస్తే రజనీకి 2.0 బాహుబలిని మించి కలెక్షన్స్ ఇస్తుందో లేదో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios