Asianet News TeluguAsianet News Telugu

రిలీజ్ కు ముందే ఇండియాలో రికార్డ్ సృష్టించిన అవతార్ -2

మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల కోసం మన సినిమాలు కిందా మీద పడుతుంటే.. హాలీవుడ్ సినిమాలు కొన్ని సినాయాసంగా రికార్డ్ లు బ్రేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. అవతార్-2 రిలీజ్ కు ముందే ఇండియాలో రికార్డ్స్ ను బ్రేక్ చేస్తోంది. 
 

Avatar 2 Movie New Records in Indian Box Office
Author
First Published Dec 11, 2022, 6:39 PM IST

మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల కోసం మన సినిమాలు కిందా మీద పడుతుంటే.. హాలీవుడ్ సినిమాలు కొన్ని సినాయాసంగా రికార్డ్ లు బ్రేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. అవతార్-2 రిలీజ్ కు ముందే ఇండియాలో రికార్డ్స్ ను బ్రేక్ చేస్తోంది. 

ఇండియాలో హాలీవుడ్  సినిమాలకున్న డిమాండ్ తెలిసిందే. ముఖ్యంగా కొన్ని ఫ్రాంచేజ్ సినిమాలంటే పడి చచ్చిపోతుంటారు మన ఆడియన్స్.  ముఖ్యంగా స్పైడర్ మాన్,  అవతార్ లాంటి సినిమాలకు మన దగ్గర మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే అవతార్-2 ఇండియాలో రిలీజ్ కు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. 

అవతార్ 2 ప్రకటించినప్పటి నుంచే ప్రపంచ అంతా ఈ సినిమా  కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మన ఇండియన్స్ ఈసినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారత్ లో ఈ నెల 16న అవతార్-2 రిలీజ్ కానుండగా, అడ్వాన్స్ బుకింగ్ లు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి.  బుకింగ్స్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే భారీ స్థాయిలో ఈ మూవీ టికెట్లు అమ్ముడు పోయాయి. దాంతో ఇండియాలో అవతార్ కు ఎంత క్రేజ్ ఉంతో తెలుస్తోంది. 

ఫస్ట్ డే  ఫస్ట్ షో కోసం.. భారీ స్థాయిలో టికెట్లు బుక్ అయ్యాయి. దాదాపు  2 లక్షల టికెట్లు అమ్ముడు కాగా, ఆలిండియా వైడ్ గా .7 కోట్ల గ్రాస్ వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కేజీఎఫ్-2, బాహుబలి-2 చిత్రాలు ఈస్థాయి వసూళ్లు రాబట్టగా, ఇప్పుడు అవతార్-2 చిత్రం కూడా వాటి సరసన చేరింది. రిలీజ్ కాకముందే ఈ రేంజ్ లో ప్రభావం చూపించిందంటే.. రిలీజ్ తరువాత ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు సినిమా పండితులు. 

వీకెండ్ టికెట్ల అమ్మకాల్లోనూ అవతార్-2 అదిరిపోయే అడ్వాన్స్ వసూళ్లు సొంతం చేసుకుంది. శని, ఆది వారాల్లో ఈ సినిమా ప్రదర్శనలకు 4.10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. దీని ప్రకారం దేశవ్యాప్తంగా .16 కోట్ల గ్రాస్ వసూలైనట్టు అంచనా. కేవలం అడ్వాన్స్ బుకింగ్ ల రూపంలోనే అవతార్-2 దాదాపు 80 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలున్నాయి. 

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామరూన్ రాన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ ఫస్ట్ మూవీ  ప్రపంచ వ్యాప్తంగా ఎంత రెస్పాన్స్ ను సాధించిందో తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 28 వేల కోట్లకు పైగా  వసూళ్ల వర్షం కురిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా అవతార్-2: ద వే ఆఫ్ వాటర్ ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందా అని అంతాఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాలో హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ శామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్, కేట్ విన్ స్లెట్, స్టీఫెన్ లాంగ్ లాంటి స్టార్స్ నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios