హాట్ క్యారెక్టర్ లో అవసరాల శ్రీనివాస్ తాజాగా పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీం అమ్మాయి పెదాలతో కిరాక్ పుట్టిస్తున్న ప్రీ లుక్ పోస్టర్

కమెడియన్ గా దర్శకుడిగా టాలీవుడ్ లో యమా బిజీగా ఉన్న అవసరాల శ్రీనివాస్, ఇటీవల నాని జెంటిల్ మన్ సినిమాతో విలన్ గానూ ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

బాలీవుడ్ లో అడల్ట్ మూవీగా తెరకెక్కిన హంటర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ బోల్డ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు శ్రీనివాస్. మనిషికి ఆకలి, దాహం, నిద్ర లాగే సెక్స్ కూడా ఓ అవసరం అనే ఆలోచన ఉన్న అబ్బాయిగా కనిపించనున్నాడు.

తెలుగులో సోగ్గాడు అనే టైటిల్ ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చిత్ర నటీనటుల పేర్లతో పాటు మునిపంటి కింద నలుగుతున్న అమ్మాయి పెదాలను పోస్టర్ లో చూపించారు.

ఈ పోస్టర్ తోనే సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన యూనిట్, సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ అడల్ట్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.