ఎన్టీఆర్ తో అట్లీ సీక్రెట్ మీటింగ్ ఎందుకబ్బా

First Published 10, Apr 2018, 3:01 PM IST
Atlee meets NTR
Highlights
ఎన్టీఆర్ తో అట్లీ సీక్రెట్ మీటింగ్ ఎందుకబ్బా

అట్లీ తమిళంలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ తీసింది మూడే సినిమాలే అయినా అన్నీ బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాయి. రీసెంట్ గా హీరో విజయ్ తో తీసిన మెర్సల్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీంతో అట్లీతో కలిసి పనిచేసేందుకు కోలీవుడ్ హీరోలతోపాటు టాలీవుడ్ హీరోలు తెగ ఉత్సాహపడుతున్నారు.  

తెలుగులో సినిమా తీయాలని తనకు ఉందని కచ్చితంగా తీస్తానని అప్పుడెప్పుడో చెప్పాడు. మహేష్, బన్నీలలో ఎవరో ఒకరితో సినిమా చేసే అవకాశం ఉందని టాక్  వినిపించింది. ఇంతలో ఏమయిందో అట్లీ మనసు మార్చకున్నాడు. తాను ఏ తెలుగు హీరోతోనూ సినిమా చేయడం లేదని ప్రకటించాడు. కానీ రీసెంట్ గా ఎన్టీఆర్ తో అట్లీ ఒ సినిమా గురించి డిష్కషన్స్ సాగాయని తెలుస్తోంది.  అట్లీ కూడా ఎన్టీఆర్ కు సూటయ్యే సబ్జెక్టు కోసం స్టోరీ మొదలుపెట్టాడనేది ఫిలింనగర్ టాక్. 

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి డైరెక్షన్లో మల్టీస్టారర్ మూవీ చేయాల్సి ఉంది. అది కూడా పూర్తయ్యాక కానీ ఎన్టీఆర్ డైరీ ఖాళీ అవదు. అందుకే వీళ్లిద్దరూ కలిసి పనిచేయడం గురించి సీక్రెట్ గా ఉంచేశారు. త్రివిక్రమ్ - రాజమౌళి సినిమాల తరవాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. సో అట్లీ తెలుగులో చేస్తే.. అది ఎన్టీఆర్ తో అన్నది పక్కా అన్నట్టు సమాచారం. 

loader