బాహుబలి ఒక్క సినిమా బాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసింది. దేశంలో సంచలన సినిమాగా మారిన బాహుబలి రికార్డును బ్రేక్ చేసేందుకు బాలీవుడ్ ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలను సిద్దం చేస్తోంది. వాటిల్లో ఏదో ఒక సినిమా అయినా బాహుబలిని మర్చిపోయేలా చేస్తుందేమో అని వారి ఆశ. అందుకోసం భారీ తారాగణంతో సినిమాలు సిద్దమవుతున్నాయి. 

ఎవరీ రాజమౌళి?  బాహుబలికి ముందు ఆయన ఎవరికి తెలుసు? అలాంటి వ్యక్తి ఒక్క సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి సాధించాడు. ఆ సినిమా దేశ సినీ చరిత్రను తిరగరాసేసింది. అలాంటి ఖ్యాతి చిన్న తెలుగు ఇండస్ట్రీకి రావడమా అన్న ఫీలింగ్ బాలీవుడ్ దర్శక నిర్మాతలే కాదు నటీ నటుల్లో కూడా ఉంది. అందుకే ఇప్పుడందరూ ఎపిక్ మూవీస్పై పడ్డారు. బాలీవుడ్ లెజెండరీ దర్శకుడు అశుతోష్ గోవార్కికర్ ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈయన గతంలో లగాన్..జోధా అక్బర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అశుతోష్ పానిపట్ పేరుతో ఓ భారీ యుద్ద చిత్రాన్ని తీయబోతున్నారు. చరిత్రలోని పానిపట్టు యుద్ధాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా ఉంటుంది. ఇందులో సంజయ్ దత్తో పాటూ అర్జున్ కపూర్ కృతి సనన్ నటించనున్నారు. ఈ ఏడాదిలోనే దీనిని విడుదలచేయనున్నారు. 

ఇక నిర్మాత కరణ్ జోహారో కూడా బ్రహ్మాస్త్ర సినిమాతో బాహుబలితో పోటీకి దిగబోతున్నారు. ఇందులో రణబీర్ కపూర్ అలియా భట్ నటించనున్నారు. ఎలాగైనా బాహుబలిని కీర్తిని తగ్గించి బాలీవుడ్ ఖ్యాతిని పెంచుకోవడమే లక్ష్యంగా అక్కడి జనాలు ఎపిక్ సినిమాలను మొదలుపెడుతున్నారు.