రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2' సినిమాలో అనుష్క వదిన పాత్రలో కనిపించిన ప్రముఖ నాట్యకారిణి అశ్రిత వేముగంటికి ఇప్పుడు వైఎస్సార్ బయోపిక్ లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహి వి రాఘవ్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.

దీనికి 'యాత్ర' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ పాత్రలో అశ్రిత కనిపించనుందని సమాచారం. మొదట ఈ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్లలో ఒకరిని తీసుకోవాలనుకున్నారు. కానీ కథ ప్రకారం సినిమాలో ఫ్యామిలీ పార్ట్ కు ఎక్కువ సన్నివేశాలు లేకపోవడంతో స్టార్ హీరోయిన్ కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ బెటర్ ఆప్షన్ అని అశ్రితను ఎంపిక చేసుకున్నారు.

దాదాపు ముప్పై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. మమ్ముట్టి టైటిల్ రోల్ పోషిస్తుండగా ఆయన పర్సనల్ అసిస్టంట్ సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి కనిపించనున్నారు.