తెలుగులో 'నరసింహానాయుడు', 'నువ్వునాకు నచ్చావ్' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఒకప్పటి హీరోయిన్ ఆశా సైని ప్రస్తుతం టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ కెరీర్ సాగిస్తోంది.

రీసెంట్ గా ఈ సీనియర్ హీరోయిన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.  బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన 'గంది బాత్' కి కొనసాగింపుగా వస్తోన్న 'గంది బాత్ 2'లో ఆశా శైని ప్రధాన పాత్ర పోషించింది.

ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు సోదరులు ఆశా సైనితో ప్రేమలో పడే కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో మరో పాయింట్ కూడా ఉంది. ఇందులో ఆశా సైని అబ్బాయిలతో మాత్రమే కాకుండా అమ్మాయిలతో కూడా రిలేషన్ పెట్టుకునే సన్నివేశాలు ఉంటాయట.

ఇద్దరి అమ్మాయిల మధ్య సంబంధం ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య కొన్ని ఘాటు సీన్లు ఇప్పుడు సోషల్ మీడియా లీక్ అయ్యాయి. లెస్బియన్ రొమాన్స్ తో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

న్యూడ్ గా నటించడానికి రెడీ.. హీరోయిన్ కామెంట్స్!