అతడితో శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పడం నా తప్పే!

arshi khan on her controversial tweet
Highlights

బాలీవుడ్ నటి అర్షి ఖాన్ మూడేళ్ల క్రితం పాకిస్థానీ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీతో ప్రేమలో ఉన్నానని

బాలీవుడ్ నటి అర్షి ఖాన్ మూడేళ్ల క్రితం పాకిస్థానీ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీతో ప్రేమలో ఉన్నానని, అతడితో శృంగారంలో పాల్గొన్నాను అంటూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో అప్పటివరకు అర్షి ఖాన్ గురించి తెలియనివాళ్లు కూడా ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మీడియాకు ఆమె హాట్ టాపిక్ అయిపోయింది.

ఈ ట్వీట్ కారణంగానే ఆమెకు బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ వచ్చినట్లుచెబుతారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న అర్షి ఖాన్ వద్ద ట్వీట్ ప్రస్తావన తీసుకురాగా, ''అఫ్రీదీ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నాకోసం ఎంతో చేశారు. అలాంటి వ్యక్తిపై నేను ఇలాంటి ట్వీట్ చేయడం నా పొరపాటే.. ఆయనను క్షమాపణలు కోరుకుంటున్నా'' అంటూ స్పందించింది. అయితే అర్షి ఖాన్ కు అసలు షాహిద్ తో పరిచయమే లేదని..ఆమె చెబుతున్నదాంట్లో నిజం లేదని గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గెహానా సంచలన వ్యాఖ్యలు చేశారు.  
 

loader