అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ గా మారిపోయిన షాలిని పాండే తాజాహా ‘నా ప్రాణమై...’ అంటూ ఓ ప్రైవేట్ పాట పాడిన షాలిని ప్రస్థుతం మహానటి, 100%కాదల్, గొరిల్లా సినిమాల్లో నటిస్తున్న షాలిని

 అర్జున్‌రెడ్డి ఫేమ్‌ షాలీనీ పాండే ‘నా ప్రాణమై...’ అంటూ సాగే ఓ ప్రైవేట్‌ సాంగ్‌ను ఇటీవల రికార్డ్‌ చేశారు. ‘లగోరీ’ అనే ఇండియన్‌ బ్యాండ్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు షాలినీ తన వాయిస్‌ అందించారు. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ పాటను రిలీజ్‌ చేశారు. షాలినీ మొదటి సినిమాలోనే తెలుగు డబ్బింగ్‌ చెప్పుకుని ‘బేబీ.. బేబీ... ’ అంటూ ఆడియన్స్‌ను అలరించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఏకంగా తెలుగులో పాట పాడి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. 

ఇదిలా ఉంటే షాలినీ ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా సూపర్‌ సక్సెస్‌ తర్వాత వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోతున్నారు. సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ సినిమాలో, జీ.వీ.ప్రకాశ్‌తో ‘100% లవ్‌’ తమిళ రీమేక్‌ ‘100% కాదల్‌ లో, జీవా సరసన ‘గొరిల్లా’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.