బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ దుబాయ్‌కి బయల్దేరి వెళ్లాడు. శ్రీదేవి మృతదేహం తరలింపులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో అర్జున్ కపూర్ ఇవాళ దుబాయ్‌కు పయనమవుతున్నాడు. బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరి కుమారుడే అర్జున్ కపూర్. మోనాకు విడాకులు ఇచ్చిన తర్వాతనే బోనీకపూర్ 1996లో సూపర్ స్టార్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారు. శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 

బోనీ కపూర్ మొదటి భార్య 2012 మార్చి 5వ తేదీన కాన్సర్ వల్ల మృతిచెందింది. మరోవైపు దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి మృతదేహం ఇంకా మార్చురీలోనే ఉంది. శ్రీదేవి హఠాన్మరణం కేసుపై సీరియస్ గా వున్న దుబాయ్ ప్రాసిక్యూటర్ అనుమతిస్తే మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు బోనీ ఫ్యామిలీ ఎదురుచూస్తున్నది.

 

మరోవైాపు శ్రీదేవి మృతిపై వస్తున్న అనుమానాలను యూఏఈలో ఉన్న భారతీయ దౌత్యవేత్త నవదీప్ సూరి ఖండించారు. ఆమె మృతికి సంబంధించి ఎలాంటి కుట్ర జరగలేదని... శ్రీదేవి మృతిపై దుబాయ్ పోలీసులకు బోనీ కపూర్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ప్రస్థుతానికి బోనీకపూర్ పాస్ పోర్ట్ సీజ్ చేశారు. కాగా మంగళవారం సాయంత్రం వరకు తిరిగి శ్రీదేవి పార్థివదదేహంతోపాటు, బోనీకపూర్ తో ఇండియాకు బయల్దేరతామని అర్జున్ కపూర్ ప్రకటించాడు.