సినీ రంగానికి దూర‌మైన రోజా హిరో అర‌వింద్ స్వామి. తన బిజినెస్‌లు చూసుకుంటూ బిజీ అయిపోయాడు. మణిరత్నం తీసిన కడలి సినిమాతో మళ్లీ మూవీల్లోకి పునరంగ్రేటం చేశాడు. ఇప్పుడు చూస్తే మళ్లీ రోజా సినిమా అరవింద్‌ను చూసినట్టే అనిపిస్తోంది.

అయితే ఇన్నేళ్ల గ్యాప్ లో ఆయన అలాగే కనిపిస్తున్నా, రోజా టైమ్‌లో ఉన్న చిన్నపిల్లలంతా ఇప్పుడు పెద్దోళ్లైపోయారు. వాళ్లలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్, రానా లాంటి వాళ్లందరూ ఉన్నారు. తను మాట్లాడుతూ ఇదే విషయంపై చమత్కరించాడు అరవింద్ స్వామి.వచ్చినప్పటి నుంచీ, మాట్లాడుతున్న ప్రతీ ఒక్కరు, నన్ను ముసలోడిని చేసేస్తున్నారు. రకుల్ ప్రీత్, రానా, చరణ్, ఇలా ప్రతీ ఒక్కరూ నేను యాక్టింగ్ మొదలెట్టే టైమ్‌కు చిన్నపిల్లలం అని చెప్పి నా ఏజ్ పెంచేస్తున్నారు.

 అయితే నా అదృష్టం బాగుండి, అల్లు అరవింద్ గారు మాత్రం అదే మాట అనలేదు. అయితే వీళ్లందరూ ఇలా చెప్పడం గురించి నేనేమీ ఫీల్ అవట్లేదు. వీళ్ల తర్వాత జనరేషన్ కూడా నా గురించి ఇదే రేంజ్‌లో చెబితే వినాలని ఉంది అంటూ ఒకవైపు చమత్కరిస్తూనే, చాలా పాజిటివ్ గా స్పందించాడు అరవింద్. ఇక సినిమా గురించి చెబుతూ ఒక రీమేక్ తీయాలంటే రెండు విధాలుగా తీయచ్చు.

 ఉన్నది ఉన్నట్టుగా తీయడం ఒకటైతే, సినిమాలోని ఆత్మను తీసుకుని సొంతంగా మంచి సినిమా తీయడం మరొకటి. సురేందర్ రెడ్డి రెండో దారిని ఎంచుకున్నారు. ఆయన జడ్జిమెంట్ అద్భుతంగా ఉంది. ఇక ఫలితం మాత్రం మీ చేతుల్లోనే ఉంది అంటూ తన స్పీచ్ ముగించాడు. అన్నట్టు, షూటింగ్ టైమ్‌లో చిరంజీవి స్పెషల్‌గా చెప్పే చిరు స్టీమ్ దోశను అరవింద్‌ కోసం చెర్రీ స్పెషల్‌గా తీసుకొచ్చాడట. నాకు అది విపరీతంగా నచ్చేసిందటూ మరోసారి గుర్తు చేసుకున్నాడు అరవింద్ స్వామి.