మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'అరవింద సమేత'. వరుస విజయాలతో టాప్ రేసులో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ని ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. కథ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో కొంత భాగం, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మిగిలిన కథను నడిపించబోతున్నారు.

సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ను హైలైట్ చేస్తూ రూపొందిస్తున్నారని సమాచారం. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే సినిమా టీజర్ ఎప్పుడు రాబోతుందనే విషయంలో చాలా రోజులుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే టీజర్ రాబోతుందనే విషయమైతే కన్ఫర్మ్ అయింది. కానీ ఏరోజు రిలీజ్ చేయబోతున్నారనే విషయాన్నీ ఆరా తీయగా.. ఆగస్టు 15న అని తెలుస్తోంది.

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అభిమానులను సంతోషంలో ముంచెత్తడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఆగస్టు 14 సాయంత్రం లేదా ఆగస్టు 15 ఉదయాన్నే టీజర్ రాబోతుందని టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండంగా మరో ముఖ్య పాత్రలో ఈషారెబ్బ కనిపించనుంది.