ఎన్టీఆర్ టైమ్ కు వస్తాడా..?

aravinda sametha movie release date issues
Highlights

ఈ సినిమా షూటింగ్ ఇంకా 60 రోజులు బ్యాలన్స్ ఉందట. అంటే ఇంకా రెండు నెలలు.. ఆగస్టు, సెప్టెంబర్ మొత్తం షూటింగ్ కు వేసుకున్నా.. మరో 11 రోజులు మాత్రమే ఉంటుంది. ఓ పక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించాలి

దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో 'అరవింద సమేత' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సినిమా షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

దానికి కారణం లేకపోలేదు.. నిన్న, మొన్నటివరకు షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయం ఉందని అనుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం టైమ్ సరిపోదని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా 60 రోజులు బ్యాలన్స్ ఉందట. అంటే ఇంకా రెండు నెలలు.. ఆగస్టు, సెప్టెంబర్ మొత్తం షూటింగ్ కు వేసుకున్నా.. మరో 11 రోజులు మాత్రమే ఉంటుంది. ఓ పక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించాలి.

లేదంటే సినిమా అనుకున్న టైమ్ కు రావడం కష్టమే.. రెండు నెలలు కూడా ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ నిర్వహించడం కూడా మామూలు విషయం కాదు. షెడ్యూళ్లు పక్కాగా ప్లాన్ చేసుకున్నామనే నమ్మకంతో చిత్రబృందం ముందుకు సాగుతుంది. మరి అనుకున్న సమయానికి అరవింద సమేతంగా వస్తాడో లేదో చూడాలి!
  

loader