ఈమధ్య జోరు తగ్గించాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. తాజాగా ఆయన కొన్ని కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశాడు. అది కూడా ముంబయ్.. హైరదరాబాద్ లపైన.
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఇండయాకు మ్యూజిక్ లో ఆస్కార్ తెచ్చిన మొదటి ఘనత తీసుకున్నాడు రెహమాన్.. అంతే కాదు ఇండియన్ మ్యూజిక్ కు ప్రపంచ స్థాయిగుర్తుంపుతీసుకువచ్చింది కూడా రెహమానే. తన ప్రతిభతో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందుకొని మన దేశానికే గర్వకారణంగా నిలిచారు. అయితే ఆయన బాలీవుడ్ లో కాని.. టాలీవుడ్ లో కాని చేసిన సినమాలు చాలా తక్కువ.ఇక టాలీవుడ్ లో అయితే.. తమిళ్ డబ్బింగ్ సినిమాలతోనే బాగా పాపులర్ అయ్యాడు రెహమాన్.
ఇంత పేరు వచ్చినా రెహమాన్ చెన్నైకే పరిమితం అయ్యాడు. బాలీవుడ్ లో పేరు వస్తున్నా ముంబయ్ కాని.. హైదరాబాద్ కాని రాలేదు. ఇక్కడ ఆస్తులు కూడా కొనలేదు. అయితే రెహమాన్ ఎదరుగుతున్న టైమ్ లో ఆయనకు గోల్డెన్ ఆఫర్లు చాలా వచ్చాయట. ఏ ఇండస్త్రీలోనైనా ఫేమ్ వచ్చిన తర్వాత బాంబే వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు రెహమాన్ కు కూడా అలాంటి అవకాశమే వచ్చిందట. కానీ ముంబైలో స్థిరపడటానికి సంకోచించారట. దీనికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రెహమాన్.
రెహమాన్ మాట్లాడుతూ, బాలీవుడ్ డైరెక్టర్ సుభాష్ ఘై తనను బాంబేకి షిఫ్ట్ అవ్వాలని అన్నారని... అయితే అప్పుడు ముంబైలో 'అండర్ వరల్డ్ మాఫియా కల్చర్' పీక్స్ లో ఉన్నందున అది సరైన ఆప్షన్ కాదని భావించినట్లు చెప్పారు. చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలని ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆఫర్ ఇచ్చినట్టు రెహమాన్ వెల్లడించాడు. కాని తాను ఆఫర్ ను సున్నతితంగా తిరస్కరించినట్టు తెలిపారు. అమెరికాలో తనకు ఇల్లు తీసుకున్నప్పటికీ, అక్కడే ఉండిపోవాలని ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు రెహమాన్.
దాదాపు 30 ఏళ్ల క్రితమే.. అంటే 1994లో తాను బాగా పాపులర్ అయిన టైమ్ లో .. ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఒక పెద్ద నిర్మాత నేను చెన్నై నుంచి వచ్చేస్తే బంజారాహిల్స్ లో పెద్ద స్థలం ఇస్తానని అన్నారు. నేను ఆయన్ని చూసి నవ్వాను. ఆ తర్వాత హిందీ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా సుభాష్ ఘాయ్ నన్ను హిందీ నేర్చుకోమని చెప్పారు. ముంబయ్ రమ్మన్నారు. అంతే కాదు భాష తెలిసి ఉంటే అక్కడి ప్రజలు నన్ను ప్రేమిస్తారు. కానీ ఆటైమ్ లో ముంబైను అండర్ వరల్డ్ మాఫియా ఏలుతుంది. అందకే నేను అటువైపుగా ఆలోచించలేదు అన్నారు రెహమాన్.
