Asianet News TeluguAsianet News Telugu

Brahmamudi: అసలు నిజాన్ని బయటపెట్టి అందరికీ షాకిచ్చిన కావ్య.. రుద్రాణి చెంప చెళ్లుమనిపించిన అపర్ణ!

Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి పోటీ ఇస్తూ మంచి రేటింగ్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇష్టం లేకుండానే దంపతులైన ఇద్దరు వ్యక్తుల కథ  ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

aparna slaps rudrani in todays brahmamudi serial gnr
Author
First Published Mar 18, 2023, 12:02 PM IST

ఎపిసోడ్ ప్రారంభంలోనే పోలీసులు రావాలి నిజం తెలుసుకోవాలి నేరం చేసింది మా అమ్మ అయినా చేయించిన వాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారు. తప్పు చేసిన మా అమ్మ మీ అమ్మగారి కాళ్లు పట్టుకుంటున్న కూడా తన ప్రమేయం లేనట్టు చూస్తూ ఊరుకుంటే తప్పు మా మీద ఎందుకు వేసుకోవాలి అంటుంది కావ్య. ఆ మనిషి ఎవరో పోలీసులు ముందే చెప్తాను పిలిపించండి అంటుంది కావ్య.

అందరూ షాకయి చూస్తూ ఉండిపోతారు. మరోవైపు రాహుల్ రాలేదని కంగారుపడుతుంటుంది స్వప్న. రాహుల్ కి నిజం తెలిసిపోయినట్లుగా ఉన్నాది.  ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు అయింది నా పరిస్థితి. ఇప్పుడు రాహుల్ ని గనుక పెళ్లి చేసుకోకుండా ఇంటికి వెళ్తే అమ్మ నా మీద మండిపడుతుంది అనుకుంటుంది. అంతలోనే రాహుల్ రావటంతో ఎందుకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు.

నీకు ఏమైందో అని కంగారు పడ్డాను అంటుంది స్వప్న. రాజ్ లేకపోవడంతో వర్క్ బర్డెన్ నా మీద పడింది మా బాబాయ్ కూడా పక్కన ఉండటంతో నీతో మాట్లాడలేకపోయాను అంటాడు రాహుల్. రాహుల్ కి నిజం తెలియలేదు అనుకొని సంతోషిస్తుంది స్వప్న. బయటికి మాత్రం ఒక మెసేజ్ పెడితే సరిపోయేది కదా ఎంత టెన్షన్ పడ్డానో అంటుంది స్వప్న.

నీకు దూరంగా ఉన్నా నిన్ను నీ అందర్నీ తలుచుకుంటూ గడిపాను అంటాడు రాహుల్. ఇక నేను వెయిట్ చేయలేను మన విషయం ఇంట్లో చెప్పి వెంటనే పెళ్లి చేసుకుందాం. కంపెనీ విషయాలన్నీ నువ్వే చూసుకుంటున్నావ్ కాబట్టి నీ మాట తప్పకుండా వింటారు అంటుంది స్వప్న. ఎక్కడికి వచ్చిన దగ్గరనుంచి పెళ్లి అని చంపుతున్నావెందుకు.

 నేను అసలే ఆఫీస్ టెన్షన్ లో ఉన్నాను అంటూ స్వప్న మీద కేకలు వేస్తాడు రాహుల్. నువ్వు వర్క్ టెన్షన్ లో ఉండి వస్తే విసిగించాను రియల్లీ సారీ అంటుంది స్వప్న. చేసిన మోసానికి పెళ్లి కావాలంట అంటూ మనసులో తిట్టుకుంటాడు రాహుల్. బయటికి మాత్రం నాకు కొంచెం టైం కావాలి అంటాడు. సరే అంటుంది స్వప్న. లేట్ అయిన పర్వాలేదు కానీ పెళ్లి చేసుకుంటే చాలు అనుకుంటుంది మనసులో.

 మరోవైపు ఇంటిగుట్టు బయట పెట్టొద్దంటుంది కనకం. ఇందాక నువ్వు ఏంటో చెప్తున్నావు ఎవరు మీకు సపోర్ట్ చేశారు అని నిలదీస్తుంది అపర్ణ. మీ అబ్బాయి ఏమి మాట్లాడటం లేదు ఫోను చేయటం మర్చిపోయి చూస్తున్నారు. నేరానికి శిక్ష పడాలి అన్నారు కదా అంటూ అసలు విషయం చెప్తుంది కావ్య. మా అక్క పెళ్లి ఇష్టం లేదని వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ మీ అందరికీ సమాధానం చెప్పలేక గదిలో ఉరేసుకోబోయింది.

ఆ పరిస్థితుల్లో మా అందరికీ ఏం చేయాలో తోచలేదు పెళ్లి పీటల మీద నన్ను కూర్చోబెట్టాలని ఆలోచన మా అమ్మకి లేదు. ఆ ఆలోచనకి అసలు కారణం ఈ రుద్రాణి గారే అంటూ రుద్రాణిని చూపిస్తుంది కావ్య. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నా ఇంట్లో మనుషుల మీద నింద వేసి తప్పించుకుందామనుకుంటున్నవా అంటాడు రాజ్. ఆవేశ పడకు జరిగింది ఆలోచించు అంటుంది ధాన్యలక్ష్మి.

రుద్రాణి ఆ గదిలోకి వెళ్లిన తర్వాతే పెళ్లికూతురని ముసుగేసి తీసుకువచ్చారు అంటే స్వప్న అప్పటికే వెళ్ళిపోయింది.ఆ విషయం రుద్రాణికి తెలుసు అంటుంది ధాన్యలక్ష్మి. ఈ అమ్మాయి చెప్పేది నిజమేనా అంటూ రుద్రాణిని నిలదీస్తుంది చిట్టి. ఇంతమంది ముందు ఇంటి ఆడపడుచుని నిలదీస్తున్నారు.ఈ ఇంటి గౌరవం కోసం ఆ పని చేయమని చెప్పింది నేనే అంటూ అందరికీ షాక్ ఇస్తుంది రుద్రాణి.

 ఇంత దారుణమైన విషయాన్ని దాచిపెట్టి ఈ అమ్మాయి నిజం బయట పెట్టే వరకు ఏమి తెలియనట్లుగా చూస్తూ కూర్చున్నావా ఈ ఇంటికి ఇంత ద్రోహం చేస్తావా అంటూ కేకలు వేస్తుంది అపర్ణ. ద్రోహం కాదు న్యాయం చేశాను. పెళ్లికూతురు వెళ్ళిపోతే పెళ్లికూతురు లేచిపోయిందని అందరూ అనుకుంటారు. అందుకే చిన్న కూతురిని పంపించి ఎలాగైనా పెద్ద కూతుర్ని తీసుకురమ్మని చెప్పి పంపించాను.

ఈ లోపుగా ఈ అమ్మాయిని పెళ్లి పీటల మీద కూర్చోమన్నాను. కానీ ఏం లాభం మోసపోయాను. స్వప్నని తీసుకురాలేకపోయారు తరువాత ఈ అమ్మాయి నిజ స్వరూపం బయటపడింది. నేను చేసింది తప్పా మన ఇంటి పరువు కోసమే ఈ పని చేశాను మోసం చేసినట్టు నిలదీస్తారేంటి అంటుంది రుద్రాణి. నోరు ముయ్యి ఇంకా నేను నువ్వు సమర్ధించుకుంటున్నావా, నీకేం హక్కు ఉందని నా కొడుకు జీవితంతో ఆడుకోవాలని అనుకున్నావు అంటూ రుద్రాణి మీద మండిపడుతుంది అపర్ణ.

 ఇంటిగుట్టు లంకకు చేటు అని ఊరికే అన్నారా ప్రస్తుతానికి వదిలెయ్ అంటుంది చిట్టి. నేను వచ్చి మీ ఇంట్లో గొడవపెట్టినట్లు అయింది నేను వస్తాను అంటుంది కనకం. మంచిది కానీ ఇంకెప్పుడూ రావద్దు అంటుంది కావ్య. నేను రాను కానీ నువ్వు అప్పుడప్పుడు వచ్చి కనిపించు అంటుంది కనకం. నేను రాను అంటుంది కావ్య. మీ అత్తారింట్లో నిన్ను ఒక ప్రశ్నలా వదిలేసి నేను ఎలా వెళ్ళగలను, నిన్ను చూడకుండా బ్రతకమని నన్ను శాసిస్తున్నావా అంటుంది కనకం.

ఇది మీ అమ్మాయి మనస్ఫూర్తిగా అంటున్న మాట కాదు. ఇంట్లో ఉండాలంటే పుట్టింటితో ఎలాంటి సంబంధాలు ఉండకూడదు అన్న నిబంధన ఉంది. అందుకే తను అలా మాట్లాడుతుంది అంటుంది భాగ్యలక్ష్మి. నేను రాకపోతేనే ఇంట్లో స్నానం దక్కుతుంది అంటే నేను చచ్చేదాకా ఇంటికి రాను అంటుంది కనకం. కానీ మీ నాన్న కి ఏం చెప్పను. తను ఏమైపోతాడో ఇప్పటికే బాధతో దిగులు పడిపోతున్నాడు.

అతనికి ఏం చెప్పాలో అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఏదో ఒకటి చెప్తాను, అబద్దాలు ఆడే అమ్మని కదా ఏదో ఒక అబద్ధం చెప్పి నమ్మిస్తాను మా గురించి నువ్వు దిగులు పడకు. ముందు వెళ్ళొస్తాను అని చెప్పి మళ్ళీ సర్దుకొని వెళ్తాను మళ్ళీ రాను అంటూ ఏడుస్తుంది. నిన్ను కూడా మర్యాదపూర్వకంగా ఈ ఇంటికి ఆహ్వానించే రోజు ఒకటి వస్తుంది అంటుంది కావ్య. నాన్న నాకు నేర్పిన దీక్ష,పట్టుదల తో నా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటాను అంటుంది కావ్య.

 రాజ్ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడే అర్హత నాకు లేదు అయినా ఒక విషయం చెప్తున్నాను ఈ పెళ్లి విషయంలో నా కూతురు తప్పు ఏమీ లేదు. ఆ బలిపీఠం నుండి తనకి ఎప్పుడు ఈ విముక్తి లభిస్తుందో అప్పుడే తన వ్యక్తిత్వం మీకు అర్థమవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది కనకం. ఇక్కడ జరిగిందేది నాన్నతో గాని, అప్పుతో గాని చెప్పకు ఇక్కడే మర్చిపో.వీళ్ళకి నామీద కోపం ఉంది కానీ ఎవరు నన్ను ఇబ్బంది పెట్టడం లేదు అంటుంది కావ్య.


 అబద్ధమే కదమ్మా అలాగే చెప్తాను అంటూ వెళ్ళిపోతుంది కనకం. తరువాయి భాగంలో  నువ్వు ఎందుకు ఇంత పని చేశావు నా కొడుకు జీవితాన్ని ఎందుకు బలి చేశావు అంటూ రుద్రాణిని నిలదీస్తుంది అపర్ణ. ఈ ఇంటి పరువు కోసమే చేశాను అని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి అంటుంది రుద్రాణి. ఆమె చంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. మీ తాతయ్య మంచితనం వల్ల పరాయి మనిషి మన ఇంట్లో ఆడపడుచు హోదా వెలగబెడుతుంది, అంతేతప్ప మన రక్తం కాదు  అంటూ రాజ్ కి చెప్తుంది అపర్ణ.

Follow Us:
Download App:
  • android
  • ios