అనుష్క కు ప్రత్యేక చికిత్స... బరువు తగ్గే ప్రయత్నంలో అనారోగ్యం

anushka treatment in kerala n tamilnadu for fitness
Highlights

  • టాలీవుడ్ లో అగ్రతారగా వెలుగొందుతున్న అనుష్క
  • తాజాగా భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న అనుష్క
  • బరువు తగ్గేందుకే సినిమాలకు దూరంగా వున్న అనుష్క
  • బరువు తగ్గినా ప్రస్థుతం సైడ్ ఎఫెక్ట్స్ కు చికిత్స తీసుకుంటున్న అనుష్క

భాగమతి తర్వాత అనుష్క మరే చిత్రాన్ని ఎందుకు ఒప్పుకోలేదు. కారణం ఏమిటనే అనుమానాలు ఆమె అభిమానులను కలవరపరుస్తున్నాయి. ‘బాహుబలి’ సీరీస్ తర్వాత అనుష్క ‘భాగమతి’ సినిమా మాత్రమే చేసింది. అయితే, ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నా ప్రస్తుతం ఏ చిత్రాలకు ఒప్పుకోవడం లేదు. ఇందుకు కారణం ఏమిటా అని ఆరా తీస్తే.. ఆమె కోయంబత్తూరు, కేరళలో ప్రకృతి వైద్యం పొందుతున్నట్లు తెలిసింది.

 

‘సైజ్ జీరో’ సినిమా కోసం బాగా లావైన అనుష్క మళ్లీ సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఇందుకు ఆమె నిత్యం కసరత్తులు, డైట్ పాటిస్తూ.. మళ్లీ పూర్వ రూపానికి వచ్చింది. దీనివల్ల ఆమె ఇప్పుడు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇందుకు కేరళలో స్పా థెరపీతో పాటు వివిధ ప్రకృతి చికిత్సలను అందుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.అనుష్క పని విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుందని ఆమెతో పనిచేసిన దర్శక నిర్మాతలు, సహ నటులు చెబుతుంటారు. ఆమె ఫిట్‌నెస్ సమస్యలు తదుపరి సినిమాలపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో ఆమె పూర్తిగా కోలుకున్నాకే కొత్త సినిమాలను ఒప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని, త్వరలోనే కొత్త సినిమాలకు సైన్ చేయనున్నారని తెలిసింది. కాబట్టి.. అనుష్క త్వరగా కోలుకోవాలని

loader