బాహుబలి అనంతరం వచ్చిన ‘భాగమతి’ సూపర్ సక్సస్ తో అనుష్క తన రేంజ్ ని మరొకసారి నిరూపించుకుంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో అనుష్క తప్పించి మరెవ్వరు లేరు అన్నది మరోసారి ‘భాగమతి’ సక్సస్ తో నిరూపించింది. ఇప్పటికే అనుష్క పెళ్లి పై అనేక రూమర్లు వస్తూ ఉన్నా ఇంకా మరికొంత కాలం తాను సినిమాలలో నటిస్తాను అంటూ అనుష్క లీకులు ఇస్తోంది.

 

 

ఈ నేపథ్యంలో అనుష్క నటించబోయే మరో లేటెస్ట్ సినిమాకు సంబంధించిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమిళ దర్శకుడు బాల దర్శకత్వంలో ఒకనాటి హీరోయిన్ జ్యోతిక తిరిగి ‘నాచియార్’ అనే మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి ఒక తమిళ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ పేరు ఈమూవీ ట్రైలర్ విడుదలైన దగ్గర నుండి కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలు మొదలయ్యాయి.

 

దీనికి కారణం ఈమూవీలో జ్యోతిక ఈమూవీలోని మరో ప్రధాన పాత్ర అయిన ఒక దొంగను ఉద్దేశించి వాడిన ఐదు అక్షరాల బూతు పదం ఎటువంటి బీప్ సౌండ్ లేకుండా ఆ బూతు పదాన్ని జ్యోతిక చేత చెప్పించేయడంతో అనేక మంది అభ్యంతరాలు చెప్పడమే కాకుండా అనేక విమర్శలు కూడ వచ్చాయి. తమిళ దర్శకుడు బాల సినిమాలలో సహజత్వం కోసం సీన్స్ సంభాషణలు చాల పచ్చిగా బూతుతో ఉంటాయి.

 

 

ఈమూవీలో జ్యోతిక ఒక పోలీసు ఆఫీసర్ గా నటించింది. ఈసినిమా కమర్షియల్ గా పెద్ద సక్సస్ కాకపోయినా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈమూవీని తెలుగులో రీమేక్  చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ్యోతిక నటించిన పోలీసు పాత్రను పోషించడానికి అనుష్కను సంప్రదిస్తే ఈ పోలీసు పాత్ర పై అనుష్క తన మోజును పెంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జ్యోతికలా అనుష్క ఎటువంటి మొహమాటం లేకుండా ఆ ఐదు అక్షరాల బూతు డైలాగ్ ను ధైర్యంగా చెప్పడానికి అంగీకరిస్తుందో లేదో చూడాలి.