బాహుబలి చిత్రంతో వాల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించిన అనుష్క అనుష్క తదుపరి చిత్రం భాగమతి భాగమతి ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు 

అందాల స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో నటిస్తోన్న ‘భాగమతి’ మూవీ ప్రస్థుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో వుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ హిస్టారికల్ డ్రామా... గ్రాఫిక్స్ వర్క్ కోసం మరింత ఆలస్యం జరుగుతోంది. బాహుబలి 2 మూవీతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన అనుష్క అప్ కమింగ్ మూవీ భాగమతి పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అనుష్క అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి లాంటి ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్‌లను ఖాతాలో వేసుకుంది. దీంతో తిరిగి మహిళా ప్రాధాన్యత ఉన్న హిస్టారికల్ చిత్రంలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని డీల్ చేస్తున్నాడు దర్శకుడు అశోక్. ఇప్పటికే పిల్ల జమీందార్ తో సక్సెస్ సాధించిన అశోక్ హిస్టారిక్ భాగమతి సక్సెస్ కోసం మరింత కష్టపడుతున్నాడు.

ఇప్పటి వరకూ ఈ చిత్రానికి సంబంధించిన అనుష్క ఫస్ట్‌లుక్‌ను సోమవారం సాయంత్రం 6 గంటల 55 నిముషాలకు రిలీజ్ చేయనున్నారు. అయితే భాగమతి చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి ఫోటోలు బయటకు రాకపోవడంతో అనుష్క ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందోనని స్వీటీ అభిమానులు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఇందులో అనుష్క ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

పిల్ల జమీందార్ చిత్రంతో దర్శకుడిగా ప్రతిభ చాటిన అశోక్.. భాగమతిపైనా పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలకపాత్రలో నటింస్తుండగా... 2018 సంక్రాంతి కానుకగా ‘భాగమతి’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

Scroll to load tweet…