టాలీవుడ్లో విడుదలైన తాజా చిత్రం ‘ అర్జున్ రెడ్డి’ ఈ సినిమాపై స్పందించిన  అనుష్క నిజాయితీతో తీసిన సినిమా అని కితాబు

ఇటీవల విడుదలై టాలీవుడ్లో వివాదాస్పదంగా మారిన సినిమా 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు నటులు స్పందించగా.. తాజాగా హీరోయిన్ అనుష్క కూడా ఈ జాబితాలో చేరారు. పలువురు ఈ సినిమాపై విమర్శలు చేస్తుండగా మరికొందరు కితాబునిస్తున్నారు.. విజయ్ దేవరకొండ- షాలినీ పాండే హీరో హీరోయిన్లుగా 'అర్జున్ రెడ్డి' సినిమా తెరకెక్కింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టీజర్‌ లో బూతు డైలాగ్స్ ఉండడంతో సంచలనం సృష్టించించిన ఈ సినిమా సినిమా రిలీజైన తర్వాత సినిమాలో ఎన్నో అభ్యంతరకరమైన దృశ్యాలు వున్నాయనే ఫిర్యాదులు అందాయి.

పలువురు నటులు మాత్రం 'అర్జున్ రెడ్డి' సినిమాను ప్రశంసించారు. ‘అర్జున్ రెడ్డి' సినిమాను కచ్చితంగా చూడండి..నిజాయితీగా తీసిన చిత్రమిదని 'అనుష్క' ఫేస్ బుక్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. చిత్ర బృందంలోని ప్రతొక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని పోస్టు చేశారు. ప్రస్తుతం అనుష్క 'భాగమతి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.