నా కూతురికి ప్రభాస్ వంటి మిస్టర్ పెర్ఫెక్ట్ కావాలి: అనుష్క తల్లి

Anushka Shetty’s mother would love to get Prabhas like Mr Perfect for her daughter
Highlights

ప్రభాస్, అనుష్క ఇద్దరూ స్టార్స్.. అలానే ఇద్దరూ కలిసి నటించారు. నాకు కూడా అనుష్క కోసం ప్రభాస్ లాంటి మిస్టర్ పెర్ఫెక్ట్ కావాలనే ఉంది.. కానీ వారిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే. ఇకనైనా వారి పెళ్లిపై రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఆపండి

'బాహుబలి' సినిమా విడుదలైనప్పటి నుండి ప్రభాస్-అనుష్కల పై రూమర్స్ వినిపించడం మరింత ఎక్కువైంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని ఇలా ఒకటా రెండా చాలా కాలం పాటు ఇదే హాట్ టాపిక్. అయితే ఈ విషయంపై ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు స్పందించి వారిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమేనని చాలా సార్లు చెప్పారు.

అయినప్పటికీ ఈ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. రీసెంట్ గా అనుష్క కూడా ఈ విషయంపై మాట్లాడింది. 'ప్రభాస్ నేను పెళ్లి చేసుకుంటున్నామని వస్తోన్న వార్తల్లో నిజం లేదని, రియల్ లైఫ్ లో బాహుబలి-దేవసేన ల కెమిస్ట్రీ ఆశించవద్దని అది ఆన్ స్క్రీన్ వరకు మాత్రమే' అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటివరకు అనుష్క ఫ్యామిలీ ఈ విషయంపై ఎప్పుడూ మాట్లాడింది లేదు. బయట వేడుకల్లో కూడా అనుష్క ఫ్యామిలీ పెద్దగా కనిపించదు.

అయితే తాజాగా అనుష్క తల్లి ప్రభాస్ తో తన కూతురు పెళ్లిపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. ''ప్రభాస్, అనుష్క ఇద్దరూ స్టార్స్.. అలానే ఇద్దరూ కలిసి నటించారు. నాకు కూడా అనుష్క కోసం ప్రభాస్ లాంటి మిస్టర్ పెర్ఫెక్ట్ కావాలనే ఉంది.. కానీ వారిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే. ఇకనైనా వారి పెళ్లిపై రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఆపండి'' అంటూ వెల్లడించారు. 

loader