అనుష్కతో లవ్ స్టోరీ.. వర్కవుట్ అవుతుందా..?

Anushka Shetty in Simbu's Vinnaithaandi Varuvaayaa 2
Highlights

అనుష్క దర్శకుడు గౌతమ్ మీనన్ తో కలిసి ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇటీవల గౌతమ్ మీనన్ 'విన్నైతాండి'(తెలుగులో ఏ మాయ చేసావే) సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మొదటి పార్ట్ లో హీరోగా నటించిన శింబు సీక్వెల్ లో కూడా నటించబోతున్నారు

కెరీర్ ఆరంభం నుండి కమర్షియల్ కథలు, విమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వస్తోన్న అనుష్క లవ్ స్టోరీస్ లో నటించింది తక్కువే. ప్రస్తుతం ఆమెకున్న ఆహార్యం బట్టి లవ్ స్టోరీలు సెట్ అవుతాయని కూడా చెప్పలేం. కానీ ఇలాంటి సమయంలో ఆమె రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించబోతుందని టాక్. 35 ఏళ్ల వయసు గల ఈ బ్యూటీ ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆమె శరీర బరువు కారణంగా ఒకరకమైన ముదురుతనం వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఆమె లవ్ స్టోరీలో నటించనుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అనుష్క దర్శకుడు గౌతమ్ మీనన్ తో కలిసి ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇటీవల గౌతమ్ మీనన్ 'విన్నైతాండి'(తెలుగులో ఏ మాయ చేసావే) సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మొదటి పార్ట్ లో హీరోగా నటించిన శింబు సీక్వెల్ లో కూడా నటించబోతున్నారు.

ఆయన సరసన హీరోయిన్ గా అనుష్క తీసుకున్నారని సమాచారం. అనుష్కతో మాములు లవ్ స్టోరీ అంటేనే ఆలోచించాలి అలాంటిది 'విన్నైతాండి' వంటి రొమాంటిక్ లవ్ స్టోరీలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవడంపై గౌతమ్ మీనన్ ఆలోచన ఏంటో..? తెలియాల్సివుంది!

loader