చాలా కాలంగా ప్రభాస్, అనుష్క మధ్య రిలేషన్ గురించి వార్తలు,రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అప్పటికి వాళ్లిద్దరూ ఖండిస్తూనే ఉన్నారు. అయినా సరే స్పెక్యులేషన్స్ ఆగటం లేదు. అనుష్క ప్యాన్స్  అవకాసం దొరికినప్పుడల్లా ఈ టాపిక్ ని తీసుకువస్తూనే ఉన్నారు. అనుష్క తన తాజా చిత్రం   ‘నిశ్శబ్దం’ సినిమా ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అప్పుడు కూడా ఈ టాపిక్ ని ఫ్యాన్స్ తీసుకువచ్చారు.

 ‘మిర్చి’లో ప్రభాస్‌, అనుష్క పెళ్లి  ఫొటో షేర్‌ చేస్తూ....ఈ ఫొటో గురించి ఒక్క మాట చెప్పండి? అని అడిగారు. దానికి అనుష్క సమాధానమిస్తూ... “సీన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు తీసిన ఒక కాండీడ్ పిక్ ఇది.  ఆపై అందమైన పోస్టర్‌గా మారింది. నా హృదయానికి చేరువైన చిత్రమది. యూవీ క్రియేషన్స్‌లో చేసిన తొలి సినిమా.నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ఇది” అన్నారామె.

గతంలో ఓ రిపోర్టర్ ప్రభాస్‌ను అనుష్కతో ఉన్న రిలేషన్ గురించి అడగ్గా..  ‘ నాకూ లేదా అనుష్కకు.. ఎవరికో ఒకరికి పెళ్లి అయితే తప్ప ఈ వదంతులు ఆగవు’ అని సమాధానం ఇచ్చాడు. అంతేకాదు అనుష్కను ఈసారి కలిసినప్పుడు ‘త్వరగా పెళ్లి చేసుకోమని చెబుతా అంటూ సరదాగా అన్నాడు. ఒకవేళ మేం రిలేషన్‌షిప్‌లో ఉంటే  ఎక్కడో చోట తిరిగేవాళ్ళమే కదా.? ఎందుకు ఈ విషయాన్ని దాచిపెడతాం అని ప్రభాస్ తెలిపాడు.
 
 ‘బాహుబలి’ చిత్రంలో దేవసేన, అమరేంద్ర బాహుబలి జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం తరువాత అనుష్క-ప్రభాస్‌ల క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది.