అనుష్క నటించిన భాగమతి చిత్రం హిట్ టాక్‌ తో కలెక్షన్స్ పరంగానూ దూసుకెళ్తోంది. విజయాన్ని ఆస్వాదిస్తున్న అందాల నటి అనుష్క ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని పంచుకొంటున్నారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి, వరుడు ఎవరు ఎలా వుండాలి అన్న విషయాల గురించిన విషయాలను ప్రస్తావించారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”భాగమతి సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత సోలో హిట్ ఎంజాయ్ చేస్తున్నాను. కేవలం సినిమా నా భారంపైనే మోసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే అంది అనుష్క.

 

ఇక బాహుబలి తర్వాత పెళ్లి గురించిన వార్తలు రావడంతో ఒత్తిడి పెరిగింది. కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసుకోమని చెబుతున్నారు. మీడియాలో కూడా ఎక్కడ పడితే పెళ్లి గురించి రూమర్లే వస్తున్నాయని అనుష్క చెప్పింది. నాకు పెళ్లి పట్ల మంచి నమ్మకం, విశ్వాసం ఉంది. కానీ సరైన సమయంలో వివాహం చేసుకొంటాను. నాకు పిల్లల్ని కనాలనే కోరిక బలంగా ఉంది. పిల్లలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. నా మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను. అదే విషయాన్ని నా తల్లిదండ్రులు చెబుతున్నారు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నానని తన మనసులో మాట బయటపెట్టింది.

 

అనుష్క భాగమతి చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రెండోవారంలోకి ప్రవేశించినా ఏ మాత్రం ప్రేక్షకాదరణ తగ్గకపోవడం విశేషం.