నువ్వు లేకుండా నేను లేను.. అనుష్క ఎమోషనల్ పోస్ట్!

anushka emotional post about her mother
Highlights

అనుష్క తల్లి ప్రపుల్లా శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేసిన అనుష్క 'నువ్వు లేకుండా నేను లేను. నువ్వు నా పక్కన ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాను. హ్యాపీ బర్త్ డే అమ్మా' అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు

దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్కకు హీరోలతో సమానంగా క్రేజ్ ఉందంటే అతిశయోక్తి కాదు. సినిమాలో హీరోలతో సమానంగా కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకుంది. నిర్మాతలు సైతం ఆమె సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు.

చివరిగా 'భాగమతి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ఆ తరువాత ఇప్పటివరకు తన తదుపరి సినిమా ప్రకటన చేయలేదు. చంద్రశేఖర్ ఏలేటితో సినిమా చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక తాజాగా అనుష్క ఓ పోస్ట్ పెట్టింది. అనుష్క తల్లి ప్రపుల్లా శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేసిన అనుష్క 'నువ్వు లేకుండా నేను లేను. నువ్వు నా పక్కన ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాను. హ్యాపీ బర్త్ డే అమ్మా' అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.

తన తల్లి కోసం ఇంట్లోనే గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసింది అనుష్క. ఇంట్లో వారందరి సమక్షంలో ఆమె కేక్ కట్ చేసిన ఫోటోను అనుష్క షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన అభిమానులు అనుష్క తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.  

 

loader