Asianet News TeluguAsianet News Telugu

వాళ్లకూ అక్కాచెళ్లెల్లున్నారని మరవొద్దంటున్న అనుపమ పరమేశ్వరన్

  • టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఎదుగుతున్న అనుపమ పరమేశ్వరన్
  • తాజాగా ఉన్నది ఒక్కటే జిందగీ మూవీతో హిట్ కొట్టిన అనుపమ
  • తనకూ టీనేజ్ లో వున్నప్పుడు వేధింపులు ఎదురయ్యాయన్న అనుపమ
anupama parameswaran shared about her bad experiences

టాలీవుడ్ లో అనుపమా పరమేశ్వరన్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అ..ఆ..’ నుంచి ‘ఉన్నది ఒకటే జిందగీ’ వరకూ ప్రతి సినిమాతో తన క్రేజ్‌ని పెంచుకుంటున్న కేరళ బ్యూటీ అనుపమ... ‘గతంలో నేనూ అందరిలాంటి అమ్మాయినే. చాలామందిలా నాకూ బస్సుల్లో వేధింపులు తప్పలేదు’ అంటూ తన జీవితంలో జరిగిన వ్యక్తిగత సంగతులనూ షేర్ చేసుకుంది. ఇటు అందంతో పాటు అటు ట్యాలెంట్ కూడా పుష్కలంగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ చిత్రానికి ప్రమోషన్స్ చేస్తోంది. 


ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అమ్మాయిలకు ఎదురయ్యే కష్టాలపై రియాక్ట్ అయింది. తను ఇప్పుడు హీరోయిన్ అయ్యాక సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా.. గతంలో ఇలాంటి ఇబ్బందులు చాలానే ఎదుర్కున్నానని చెబుతోంది అనుపమ. కుర్రాళ్ల నుంచి.. కొన్ని సార్లు లెక్చరర్ల నుంచి కూడా వెకిలి మాటలు వినాల్సి వచ్చేదని చెబుతోంది అనుపమ. ఇక లైంగిక వేధింపులు కూడా అమ్మాయిలకు తప్పడం లేదని.. తాను కూడా చదువుకునే రోజుల్లో హాస్టల్ నుంచి కాలేజ్ కు బస్సులో వెళ్లేటపుడు చాలానే ఇబ్బంది పడ్డానని అంటోంది ఈ మలయాళీ భామ.
 

దగ్గరగా నుంచోవడం.. అసభ్యంగా తాకడం వంటివి చేసేవారని.. కొన్ని సార్లు కండక్టర్లు కూడా ఇలాంటివాటికి పాల్పడేవారని చెబుతున్న ఈమె.. అసలు ఇలాంటి చర్యల కారణంగా వాళ్లు ఏం పొందుతారో అర్ధం కాదని అంటోంది. అమ్మాయిలను ఇలాంటి వెకిలిమాటలతో.. చేష్టలతో ఇబ్బందిపెట్టేవారు.. ఎవరు ఏ ఉద్దేశంతో తమను చూస్తున్నారో అర్థం చేసుకోవడం అమ్మాయిలకు పెద్ద కష్టమేం కాదు. అలా ప్రవర్తించేవాళ్లంతా తమకూ ఇంట్లో అమ్మలూ, అక్కాచెల్లెళ్లూ ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇలాంటి వేధింపుల గురించి చర్చిస్తున్న ‘మీటూ’ ఆన్‌లైన్ క్యాంపైన్ చాలా అర్థవంతమైందని నా అభిప్రాయం.

 

హైదరాబాద్‌లో గోల్కొండ, బిర్లా మందిర్, చార్మినార్ లాంటి అన్ని ప్రాంతాల్నీ చూశా. ఆంధ్రాలో వైజాగ్, గోదావరి జిల్లాలు నాకు బాగా నచ్చాయి. ‘శతమానం భవతి’కి 49 రోజుల పాటు గోదావరి జిల్లాల్లోనే పనిచేశా. రాజమండ్రి, అమలాపురం లాంటి ప్రాంతాల్లో తిరుగుతుంటే కేరళలో మా ఊళ్లో ఉన్నట్టే అనిపించేది. నాకు అక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. పెసరట్టు, ఉప్మా, పునుగులు.. ఇలా గోదావరి జిల్లాల్లో దొరికే చాలా పదర్థాలు నాకు తెగనచ్చేశాయి. కేవలం భోజనం మాత్రమే కాదు.. వాళ్లు వడ్డించే తీరు.. ‘అమ్మా పెట్టుకోమ్మా. రండమ్మా’ అంటూ అన్నంతో పాటు కాస్త ప్రేమనూ కలిపి వడ్డిస్తారు. వాళ్ల యాస, కొత్త వాళ్లని ఆదరించే తీరు నన్ను కట్టిపడేశాయి. ముఖ్యంగా.. ‘ఏం చేశావ్ రా..’ అంటూ వాళ్లు ఆ యాసలో అంటుంటారు కదా! అది నాకు చాలా ఇష్టం.

Follow Us:
Download App:
  • android
  • ios